స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ వెంటనే స్వతంత్ర భారతదేశంలో కలవలేదు. 1948 సెప్టెంబర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ మిలిటరీ సహాయంతో హైదరాబాద్ను భారతదేశంలో కలపడం జరిగింది. అయితే దేశానికి స్వతంత్రం వచ్చినప్పటినుండి అప్పటివరకు హైదరాబాద్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో నాటి రజాకర్ల పాలన ఎలా ఉండేది అని నిజ సంఘటనలపై రజాకర్ అనే చిత్రం విడుదల కావడం జరిగింది. గూడూర్ నారాయణ రెడ్డి నిర్మాతగా యాట సత్యనారాయణ దర్శకత్వంలో రాజ్ అర్జున్, బాబీ సింహ, అనసూయ, వేదిక తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ఈ చిత్రంలో నటించడం జరిగింది. అయితే ఎంత మంచి సినిమా అయినప్పటికీ విడుదల అయిన కొన్ని రోజులలోనే ఓటీటీకి వచ్చేస్తుంది కానీ ఈ చిత్రం ఇన్ని నెలలు అయిన ఓటీటీకి రాకపోవడంతో ఇకపై కూడా రాకపోవచ్చని ప్రేక్షకులు అనుకుంటున్నా సమయంలో ఈ చిత్ర ఓటిటి విడుదల ఖరారైంది. ఆహాలో ఈ చిత్రం జనవరి 24 నుండి స్ట్రీమ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆహా తమ యూట్యూబ్ ఛానల్ లో ఈ చిత్ర ఆహా వెర్షన్ ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.