‘గేమ్ చేంజర్’ సినిమాను ‘గాడ్స్ స్పెష‌ల్ ఏంజెల్స్‌’తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించిన ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ వీరేంద్ర స‌చ్‌దేవ్‌

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 2025 ఏడాదిని ‘గేమ్ చేంజర్’ బ్లాక్ బ‌స్ట‌ర్‌తో ఘ‌నంగా స్టార్ట్ చేశారు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందింది. ఈ మూవీ తొలి ఆట నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో ఇటు మాస్‌, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అల‌రిస్తూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇప్ప‌టికే ఈ మూవీ రూ.300 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణు పొందుతోన్న గేమ్ చేంజ‌ర్ చిత్రాన్ని తాజాగా ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ వీరేంద్ర స‌చ్‌దేవ్ ‘గాడ్స్ స్పెష‌ల్ ఏంజెల్స్‌’లోని చిన్నారుల‌తో క‌లిసి ప్ర‌త్యేకంగా వీక్షించటం విశేషం.

వీరేంద్ర స‌చ్‌దేవ్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. పిల్ల‌ల‌తో క‌లిసి ఆయ‌న షోను వీక్షిస్తున్న స‌మ‌యంలోని ఫొటోల‌ను ఆయ‌న షేర్ చేశారు. ‘రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ న‌టించిన గేమ్ చేంజ‌ర్ చిత్రాన్ని గాడ్స్ స్పెష‌ల్ ఏంజెల్స్‌తో క‌లిసి వీక్షించటం ద్వారా నా పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకోవ‌టం ఎంతో ఆనందంగా ఉంది. ఆ పిల్ల‌ల్లో బిగ్ స్క్రీన్‌పై సినిమాను వీక్షిస్తున్న‌ప్పుడు క‌లిగిన సంతోషం, ఎగ్జ‌యిట్‌మెంట్‌ను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాను’ అని వీరేంద్ర స‌చ్‌దేవ్ పేర్కొన్నారు.

‘గేమ్ చేంజర్’లో రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ అవ‌తార్‌లో ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఆవిష్క‌రించారు. అద్భుత‌మైన క‌థ‌, యాక్ష‌న్ స‌న్నివేశాలతో సినిమాను తెర‌కెక్కించారు. మాస్ట‌ర్ మూవీ మేక‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశం, ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, ఆక‌ట్టుకునే డైలాగ్స్‌, ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌, భారీ తారాగ‌ణంతో రూపొందిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. వారాంతం కంటే ముందుగానే గేమ్ చేంజ‌ర్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.300 కోట్లు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టటం విశేషం. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రాన్ని శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.