‘నాగబంధం’ నుంచి విరాట్ కర్ణ ఫస్ట్ లుక్    

హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘నాగబంధం’ నుంచి రుద్రగా యువ హీరో విరాట్ కర్ణ  ప్రీ-లుక్ ఇటీవల విడుదలై మంచి బజ్ క్రియేట్ చేసింది. పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రాండ్-స్కేల్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రానా దగ్గుబాటి లాంచ్ చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో విరాట్ కర్ణ  ఫెరోషియస్ రగ్గడ్ అవతార్ లో సాలిడ్ ఫిజక్ తో కనిపించారు. యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్ లో అతని సిక్స్-ప్యాక్ అబ్స్ ప్రజెంట్ చేస్తోంది. కర్ణను స్టన్నింగ్ అవతార్‌లో, సముద్రంలో భయంకరమైన మొసలితో  పోరాడుతున్నట్లు చూపిస్తున్న ఫస్ట్ లుక్ అదిరిపోయింది. తన ఒట్టి చేతులు, తాడుతో మొసలి నోరు తెరిచి పట్టుకున్న రుద్ర డేరింగ్ నేచర్ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా క్యురియాసిటీని క్రియేట్ చేసింది.

‘ది సీక్రెట్ ట్రెజర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘నాగబంధం’ ఒక ఎపిక్ అడ్వంచర్ గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా కథ స్క్రీన్‌ప్లే రెండింటికీ తనదైన విజన్ తీసుకువస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ఆధ్వర్యంలో కిషోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా గర్వంగా సమర్పిస్తున్నారు.

నాగబంధం పాన్-ఇండియన్ ఎపిక్,ఆధ్యాత్మికతను ఉత్కంఠభరితమైన సాహసయాత్రతో మిళితం చేస్తుంది. ఇందులో నభా నటేష్,  ఐశ్వర్య మీనన్  హీరోయిన్స్,  జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ కీలక పాత్రల్లో నటించారు.

నాగబంధం..పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుండి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో వుంటుంది. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని నాగబంధంలో అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.

నాగబంధం అసాధారణమైన నిర్మాణ విలువలు, అత్యాధునిక VFX హై -ఆక్టేన్ అడ్వంచర కి ప్రామిస్ చేస్తోంది. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు, అభే సంగీత దర్శకుడు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాయగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్.

నాగబంధం 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా విడుదల  కానుంది.

తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఈశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: NIK స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్
సమర్పణ: లక్ష్మి ఐరా & దేవాన్ష్
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాత: కిషోర్ అన్నపురెడ్డి
సహ నిర్మాత: తారక్ సినిమాస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే
సీఈవో: వాసు పోతిని
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
ఎడిటర్: RC పనవ్
కాస్ట్యూమ్ డిజైనర్: అస్విన్ రాజేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభినేత్రి జక్కల్
యాక్షన్: వెంకట్, వ్లాడ్ రింబర్గ్
స్క్రిప్ట్ డెవలప్‌మెంట్: శ్రా1, రాజీవ్ ఎన్ కృష్ణ
Vfx: థండర్ స్టూడియోస్
Vfx సూపర్‌వైజర్: దేవ్ బాబు గాండి (బుజ్జి)
పబ్లిసిటీ డిజైన్స్: కాని స్టూడియో