విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నైట్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ లైవ్ లో బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ పాడటం అందరినీ ఉర్రూతలూగించింది.
బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. నేను హీరోలా కాకుండా ప్రొడ్యూసర్ లా ఆలోచిస్తాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఇది వండర్ ఫుల్ జర్నీ. ఇది నా 76వ సినిమా. ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న వస్తోంది. అనిల్ వండర్ ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చారు. తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. సినిమా ఎక్స్ ట్రార్డినరీ గా వచ్చింది. నిర్మాతలు చాలా హ్యాపీగా వున్నారు. నా అభిమానులు ఇలాంటి సినిమాలని చాలా ఇష్టపడతారు. వాళ్ళ ప్రేమ ఎప్పుడూ చూపిస్తూనే వున్నారు. మళ్ళీ మేము సంక్రాంతికి మంచి సినిమాతో వస్తున్నాం. మీరంతా ఫ్యామిలీతో రావాలి. మామూలుగా వుండదు చాలా ఎంజాయ్ చేస్తారు. అనిల్ ప్రతి సీన్ అద్భుతంగా తీశాడు. చాలా ఎంటర్ టైన్మెంట్ నవ్వులు వుంటాయి. సినిమాని ఎంకరేజ్ చేస్తున్నా మీడియాకి థాంక్ యూ. వారి నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఐశ్వర్య, మీనాక్షి థాంక్ యూ. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. దిల్ రాజు గారు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కొరుకుంటున్నాను’ అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి సినిమాకి హైప్ తీసుకొచ్చారు. గోదారి గట్టు సాంగ్ 90 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ పాట రాసిన భాస్కర్ భట్ల గారికి, సింగర్ రమణ గోగుల గారికి, మిగతా సింగర్స్ కి, ముఖ్యంగా వెంకీ గారికి థాంక్ యూ. మా జర్నీని మ్యూజిక్ తర్వాత నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది మా ప్రమోషనల్ టీం. పీఆర్ వంశీ శేఖర్, డిజిటల్ మనోజ్ కి థాంక్ యూ. మమ్మల్ని వెనకుండి నడిపించిన వెంకటేష్ గారికి థాంక్ యూ. భాను మాస్టర్ చక్కగా కొరియోగ్రఫీ చేశారు. నా రైటింగ్ టీంకి థాంక్ యూ. సమీర్ రెడ్డి గారితో నాకు మంచి సింక్ వుంది. మళ్ళీ ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఎడిటర్ తమ్మిరాజు గారు, మా డైరెక్షన్ టీం అందరికీ థాంక్ యూ. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ థాంక్ యూ. ఐశ్వర్య, మీనాక్షి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. దిల్ రాజు గారు శిరీష్ గారు నా ఫ్యామిలీ. ఎంతో సపోర్ట్ చేస్తారు, జనవరి 14న డైరెక్షన్ లో మరో బ్లాక్ బస్టర్ రాబోతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మీరంతా కొత్తగా ఫీలయ్యే కామెడీ. చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రయత్నించాను. ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఏడు సినిమాలని హిట్ చేసి నాకు ఎనర్జీ ఇచ్చిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు. ఎనిమిదో సినిమా వస్తోంది. ఇది నా కెరీర్ లో బెస్ట్ ఎంటర్ టైనర్ కాబోతోంది. నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చిన వెంకటేష్ గారికి థాంక్ యూ. ఫ్యామిలీతో కలసి ఈ సినిమా చూడండి. హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటికి వస్తారు. ఇది మీకు మెమరబుల్ సంక్రాంతి వస్తుంది. థట్స్ మై ప్రామిస్. వెంకటేష్ గారు ఒక టీచర్ లా ఒక ఫ్రెండ్ లా సడన్ గా స్టూడెంట్, పెద్దమనిషిలా అనిపిస్తారు. ఒక మనిషిలో ఇన్ని క్యాలిటీస్ వుండటం నాట్ ఏ జోక్. అది వెంకీ గారికే పాజిబుల్. నాకు నా ఫ్యామిలీ ఎంత ఇష్టమో వెంకటేష్ గారు కూడా అంత ఇష్టమైన మనిషి. ఈ జర్నీని మర్చిపోలేను. ఈ సినిమా కోసం చాలా గైడ్ చేశారు. ఇది మా కాంబినేషన్ లో మూడో సినిమా. హ్యాట్రిక్ చేస్తారని నమ్ముతున్నాను. జనవరి 14 డోంట్ మిస్ ఇట్. హిస్టరీలో వెంకీ సార్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతిసారి విక్టరియే’ అన్నారు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. ఈ రోల్ ఇచ్చిన అనిల్ గారికి థాంక్ యూ. సినిమా మ్యూజికల్ ట్రీట్ లా వుంటుంది. భీమ్స్ గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. ఐశ్వర్యకి థాంక్. దిల్ రాజు గారికి శిరీష్ గారి థాంక్. వెంకటేష్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్. తప్పకుండా అందరూ సంక్రాంతి వస్తున్నాం చూడండి’అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ..13 ఏళ్ల క్రితం అనిల్ గారితో కలసి పని చేయాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. మళ్ళీ ఈ సినిమాతో అవకాశం వచ్చింది. దిల్ రాజు గారి బ్యానర్ లో బలగం చేశాను. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా చేశాను. వెంకటేష్ గారితో ఫస్ట్ టైం కలిసి పని చేయడం హ్యాపీగా వుంది. ఇందులో పాటలు రాసిన లిరిక్ రైటర్స్ కి సింగర్స్ అందరికీ థాంక్ యూ. గోదారి గట్టు పాట టాప్ 2 లో వుంది. రమణ గోగుల గారికి థాంక్ యూ. నా పాటని జీవిత కాలం జ్ఞానపకం ఇచ్చిన వెంకటేష్ గారికి థాంక్ యూ. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా క్రెడిట్ అనిల్ గారిది. దిల్ రాజు గారి సపోర్ట్ ని మర్చిపోలేను. వారి బ్యానర్ లో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కలని నిజం చేసిన వెంకటేష్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మ్యూజికల్ గా వుంటుంది. సినిమా మీ అందరినీ అలరిస్తుంది’ అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ..నేను తమిళ్ లో చాలా సినిమాలు చేశాను. తెలుగులో మంచి క్యారెక్టర్ పడితే బావుండని అమ్మ చెప్పేది. ఈ సినిమాతో ఆ అద్భుతమైన క్యారెక్టర్ వచ్చింది. అనిల్ గారికి థాంక్. వెంకటేష్ గారితో వర్క్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. మీనాక్షి లవ్లీ పర్శన్. దిల్ రాజు గారి బ్యానర్ లో చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా నిర్మాతలు చాలా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అనిల్ సినిమాని చాలా హెల్తీ అందరూ ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దారు. సమీర్, భీమ్స్, ఇలా టీం అంతా కలసి సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. బ్లాక్ బస్టర్ ఆన్ ది వే. వెంకటేష్ గారు టీం అంతా మాకు ఎలాంటి బర్డెన్ లేకుండా సినిమాని తీసిపెట్టారు. ప్రేక్షకులు సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ’ అన్నారు.
వీటీ గణేష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ అనిల్ గారు యాక్టర్స్ ని హ్యాండిల్ చేసే విధానం అద్భుతం. వెంకటేష్ గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఇందులో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. ఇందులో నరేష్ గారితో నా సీన్స్ చాలా బావుంటాయి. మంచి కామెడీ పిక్చర్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.
డిఓపి సమీర్ రెడ్డి మాట్లాడుతూ.. వెంకటేష్ గారు నేను రెడీ అనగానే మార్క్ లోకి వచ్చి నిలబడేవారు. నిజంగా ఆయనకి హ్యాటప్స్. అనిల్ గారు ట్యూన్స్ తో సహా స్క్రిప్ట్ చెప్పారు. కథ వినగానే ఇది బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యాం. దిల్ రాజు గారితో ఇది నా ఎనిమిదో సినిమా. వారితో మరిన్ని సినిమాలు చేయాలని వుంది’అన్నారు
ఎడిటర్ తమ్మిరాజు మాట్లాడుతూ… ఈ సినిమాలో ఎడిటర్ గా నేను చాలా తక్కువ వర్క్ చేశాను. ఎందుకంటే అనిలే ఈ సినిమాకి ఎంత కావాలో పర్ఫెక్ట్ గా అంతే తీశారు. నేను ఎక్కువగా రాజమౌళి గారితో అనిల్ గారితో సినిమాలు చేశాను. వాళ్లతో ఎంత వర్క్ చేస్తున్న సరే అలుపే ఉండదు. చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం. అనిల్ తో వర్క్ చేయడం అంటే ఒక ఫ్యామిలీతో వర్క్ చేసినట్లే. ఈ సినిమాలో వెంకటేష్ గారు ఐశ్వర్య రాజేష్ గారు మీనాక్షి చౌదరి గారు వండర్ఫుల్ గా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమా డెఫినెట్ గా డబుల్ బ్లాక్ బస్టర్’ అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్ మాట్లాడుతూ.. దిల్ రాజు గారి బ్యానర్లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి థాంక్యూ .హీరో వెంకటేష్ గారికి థాంక్యూ. ఈ సినిమా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ టాక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరం చాలా పాజిటివ్ గా వర్క్ చేశాం. డెఫినెట్ గా ఇది బ్లాక్ బస్టర్ మూవీ’ అన్నారు.
యాక్టర్ ఉపేంద్ర లిమాయే మాట్లాడుతూ.. యానిమల్ లో నా వాయిస్ ని తెలుగు లో డబ్ చేయించిన మై డియర్ ఫ్రెండ్ సందీప్ రెడ్డి వంగాకి థాంక్ యూ. అలా నేను తెలుగుకి పరిచయమయ్యాను. అనిల్ రావిపూడి గారు వెరీ ఇంట్రస్టింగ్ ట్యాలంటెడ్ డైరెక్టర్. వెంకటేష్ గారితో వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారు శిరీష్ గారికి థాంక్ యూ’ అన్నారు.
లిరిక్ రైటర్ భాస్కర భట్ల మాట్లాడుతూ.. ఇందులో గోదారి గట్టు పాట రాశాను. ఇంత హ్యుజ్ హిట్ అవుతుందని అనుకోలేదు. భీమ్స్ రూపంలో నాకు మరో చక్రీ దొరికారు. రమణ గోగుల గారికి అభిమానిని. అలాగే మధుప్రియ చక్కగా పాడారు. భాను మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. దిల్ రాజు గారి బ్యానర్ లో బొమ్మరిల్లు సినిమాలో బొమ్మని గీస్తే పాట రాశాను. అది నా కెరీర్ కి మలుపు. వారి బ్యానర్ లో రాయడం ఆనందంగా వుంది. అనిల్ థాంక్ యూ. ఈ సినిమా సాధించబోయే విజయం కోసం ఎదురుచూస్తున్నాను’ అన్నారు.
సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కళ ముందే తెలిసిపోతోంది. వెంకటేష్ గారి ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నేను రాసిన పాట ఆయన అద్భుతంగా పాడారు. అనిల్ తన టీంని అద్భుతంగా నడుపుతారు. తనతో ఇంకా ట్రావెల్ చేయాలని వుంది. చాలా మంచి పాటలు పడ్డారు. ఈ సంక్రాంతికి గొప్ప సినిమా పడుతోంది. రాజు గారు బావుంటే ఇండస్ట్రీ బావుంటుంది. కొత్తవారికి అవకాశాలు వస్తాయి. ఆయన చాలా మందికి ఆదర్శం. సినిమా చూడానికి ఎదురుచూస్తున్నాను.
సింగర్ రమణ గోగుల మాట్లాడుతూ.. నేను ఎవరి సంగీతంలో పాట పాడలేదు. ఈ సినిమాకి పాడటం డెస్టినీ అనుకుంటాను. నా ఫ్రెండ్ వెంకీకి 23 ఏళ్ల తర్వాత పాడటం ఆనందంగా వుంది. భీమ్స్, భాస్కర్ బట్లకి కంగ్రాట్స్. గోదారి గట్టు పాట 89 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం ఆనందంగా వుంది. యూట్యూబ్ చార్ట్స్ లో నెంబర్ 2 గా వుంది, గ్లోబల్ గా నెంబర్ 8 లో వుంది. టీం అందరికీ క్రెడిట్ ఇది. ఈ సినిమా చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను. వెంకీ అనిల్ దిల్ రాజు గారు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ అన్నారు.
కో రైటర్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. సంక్రాంతికి మేము వస్తున్నాం, మీరు కూడా సినిమాకి తప్పకుండా రావాలి. అనిల్ వెంకీ గారి కాంబో మిమ్మల్ని అలరిస్తుంది. డెఫినెట్ గా థియేటర్స్ లో నవ్వుల బ్లాస్ట్ వుంటుంది’ అన్నారు
కో రైటర్ ఆదినారాయణ మాట్లాడుతూ.. వెంకటేష్ గారు అనిల్ గారు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారు. సాంగ్స్ టీజర్ ట్రైలర్ చూసి జనం మాకు ఆల్రెడీ కంగ్రాట్స్ చెబుతున్నారు. అనిల్ స్క్రిప్ట్ ని బెటర్మెంట్ చేసే విధానం అద్భుతం. చాలా కమిట్మెంట్ తో వర్క్ చేస్తారు. వెంకటేష్ గారు వేరే రేంజ్ లో చేశారు. ఫ్యాన్స్ కి ఇందులో మాస్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. ఈ సినిమా చాలా పెద్ద కాబోతోంది’ అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.