‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లైమాక్స్ రెవీల్ చేసిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో విక్టరీ వెంకటేష్ విలేకరుల సమావేశంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ విశేషాల్ని పంచుకున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం కోసం ఎంత ఎక్సయిటెడ్ గా వున్నారు ?
-నా కెరీర్ ఇది మరో సంక్రాంతి. ఒక క్లీన్ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ తో రావడం చాలా ఆనందంగా వుంది. లిటిల్ క్రైమ్ ఎలిమెంట్ న్యూ జానర్ కూడా వుంది. సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అంతా పాజిటివ్ గా వుంది. నా కెరీర్ లో సంక్రాంతికి వచ్చిన మోస్ట్ ఫిలిమ్స్ చాలా బాగా ఆడాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడుతుందనే నమ్మకం వుంది.

ఈసారి ప్రమోషన్స్ చాలా ఎనర్జిటిక్ గా చేయడానికి కారణం ?
-ఇది నేచురల్ గా జరిగింది. మ్యూజిక్ చాలా నచ్చింది. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. కొన్ని మ్యూజిక్ ట్యూన్స్ వినగానే క్రేజీగా అనిపించింది. అలాగే డైరెక్టర్ అనిల్, ఇద్దరు హీరోయిన్స్.. లైవ్లీ టీం కుదిరింది. ప్రమోషన్స్ లో ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. ప్రమోషన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేయడం హ్యాపీగా వుంది.

మీతో సాంగ్ పాడించాలనే ఆలోచన ఎవరిది ?
-నైట్ రెండు గంటలకి ఆ సాంగ్ విన్నప్పుడు తెలియకుండానే డ్యాన్స్ చేశాను. ఎదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్ లో వుంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే వుంది. ఇంగ్లీష్ వర్డ్స్ వుండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది(నవ్వుతూ).

-ఇందులో రమణ గోగుల గారు పాడిన పాట పెద్ద హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాడారు. పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ విన్నప్పుడు మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి ?
-ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ లైనే చాలా ఫ్రెష్ గా అనిపించింది. మినిమం గ్యారెంటీ అని అక్కడే తెలిసిపోయింది. అనిల్ నాది సూపర్ హిట్ కాంబినేషన్. మేము చాలా ఫ్రెండ్లీగా వుంటాం. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇందులో కామెడీ స్టయిల్ కొంచెం డిఫరెంట్ గా వుంటుంది. చాలా షటిల్ గా కొత్తగా ట్రై చేశాం. ఫ్రెష్ సీన్స్ వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. అనిల్ తో మంచి రేపో కుదిరింది. తనతో మూవీస్ కంటిన్యూ చేయాలని వుంది.

మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ గురించి?
-ఇద్దరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. చక్కగా పెర్ఫామ్ చేశారు. క్యారెక్టర్స్ వెరీ క్రేజీగా వుంటాయి.

భీమ్స్ మ్యూజిక్ గురించి ?
-భీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేసి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తనకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో చేశాడు. ఫస్ట్ ట్యూన్ వినగానే హిట్ అనుకున్నాం. అది సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అది ఆడియన్స్ గొప్పదనం. గోదారి గట్టు పాట 85 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అనిల్ గారు మీ ఎక్స్ కాప్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది ?

  • చాలా సరదాగా అనిపించింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి.. నా గురించే ఆలోచిస్తున్నావా ? నేను వచ్చే లోపల నలుగురిని కన్నావ్..అన్నప్పుడు చాలా హిలేరియస్ గా అనిపించింది. అలాంటి సీన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో నాకు నలుగురు పిల్లలు. అందులో ఒకడిని చాలా హ్యాండిల్ చేయాల్సివచ్చింది(నవ్వుతూ).

-ఇందులో క్లైమాక్స్ లో చెప్పే డైలాగ్స్ చాలా క్రేజీ వుంటాయి. ఆడియన్స్ చాలా ఎంటర్టైన్ అవుతారు. యూత్ డైలాగ్స్ ని చాలా లవ్ చేస్తారు

మీరు సెట్స్ లో వుంటే నిర్మాత సెట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదని దిల్ రాజు గారు చెప్పారు. మీరే చాలా జాగ్రత్తగా చూసుకుంటారని అన్నారు ?
-లేదండి.. నిర్మాతలు రావాలి(నవ్వుతూ) నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ప్రతి సినిమా నా సొంత సినిమాగా చేస్తాను. ప్రతి ఒక్కరూ హ్యాపీగా వుండాలని కోరుకుంటాను. సిన్సియర్ గా పని చేస్తాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్ సీతమ్మ వాకిట్లో నుంచి ట్రావెల్ అవుత్నాను. వారితో జర్నీ చాలా కంఫర్ట్ బుల్ గా వుంటుంది. మేము చేసిన సినిమాన్నీ బాగా ఆడాయి. వారికి మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను.

డెబ్బై రోజుల్లోనే ఈ సినిమాని ఫినిష్ చేయడం ఎలా అనిపించింది ?
-సినిమాని ఫాస్ట్ గా ఫినిష్ చేయడం హ్యాపీగా అనిపించింది. అనుకున్నదాని ప్రకారం అన్నీ అద్భుతంగా కుదిరాయి.

ఈ సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెబుతారు ?
-వెరీ నైస్ ఫెస్టివల్ ఫిల్మ్ తో వస్తున్నాం. చాలా ఎంటర్ టైన్మెంట్ వుంటుంది. క్లైమాక్స్ చాలా సర్ ప్రైజ్ చేస్తుంది. పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు.

బాలయ్య గారి అన్ స్టాపబుల్ షోకి వెళ్ళడం ఎలా అనిపించింది ?
-ఐయామ్ గ్లాడ్. వెరీ గుడ్ టైం. వెరీ నైస్ ఎక్స్ పీరియన్స్.

హిట్స్, ఫ్లాప్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయా ?
-హానెస్ట్ అండ్ సిన్సియర్ గా వర్క్ చేయడమే మన చేతిలో వుంటుంది. హిట్స్, ఫ్లాప్స్ మన చేతిలో వుండవు. మన కంట్రోల్ లో లేని విషయాలు గురించి నేను ఎక్కువ థింక్ చేయను.

మీ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి చాలా పాజిటివ్ పోస్టలు వస్తుంటాయి ?
-లైఫ్ లో పాజిటివ్ గా వుండాలి. ఓవర్ థింకింగ్ అనవసరం. ఓ పాజిటివ్ థాట్ తో రోజు మొదలుపెడితే జీవితం చాలా హాయిగా వుంటుంది.

రానా నాయుడు 2 ఎప్పుడు ?
-మార్చిలో రావచ్చు. డబ్బింగ్ అయ్యింది.

నెక్స్ట్ సినిమా గురించి ?
-సురేష్ ప్రొడక్షన్, సితార వంశీ, మైత్రీ, వైజయంతి మూవీస్ లో కథల పై వర్క్ జరుగుతుంది. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ