Home సినిమా వార్తలు మీటింగ్ లో జరిగిన విషయాల పై క్లారిటీ ఇచ్చిన ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు
- సీఎం తో భేట్ అయిన తరువాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయి.
- సీఎం మీటింగ్ లో అసలు జరగని వి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారు.
- సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ చాలా బాగా జరిగింది.
- 0.5 పర్సెంట్ కూడా నెగిటివ్ లేదు.
- సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు.
- బెనిఫిట్స్ షోలు టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదు.
- పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు ప్రదర్శించలేదు.
- బౌన్సర్స్ విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు ప్రతిదీ అకౌంట్ బిలిటీగా ఉండాలి అని డీజీపీ సూచించారు.
- హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరిపేలా అభివృద్ధి చేద్దాం అన్నారు.
- హైదరాబాద్ కు ఐటీ ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమకూడా అంతే కీలకం గా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు.
- సామాజిక సేవ కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలి అని చెప్పారు.
- అలాగే గద్దర్ అవార్డ్స్ ను FDC తో అనుసంధానంగా జరగాలి అని చెప్పారు.