ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ – టెక్నిషియన్స్ గా మేము ఎప్పుడూ తెర వెనకే ఉంటాం. కానీ “డ్రింకర్ సాయి” ఈవెంట్స్ మమ్మల్ని కూడా హైలైట్ చేస్తున్నారు. ఈ సినిమాను మేము మల్టిపుల్ టైమ్స్ చూశాం. కుటుంబంతో కలిసి సినిమాను మీరంతా చూడొచ్చు. “డ్రింకర్ సాయి” సినిమా విజయం మీద నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
కొరియోగ్రాఫర్ మోయిన్ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాలో కొరియోగ్రఫీ బాగా కుదిరింది. సాంగ్స్ కొరియోగ్రఫీలో డైరెక్టర్ కిరణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. స్టెప్స్ చెప్పగానే ఐశ్వర్య వెంటనే చేసేది. హీరో ధర్మ మంచి హార్డ్ వర్క్ చేస్తాడు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ మాట్లాడుతూ – ఈ సినిమా గురించి నా ఎక్సిపీరియన్స్ చెప్పాలంటే ముందు డైరెక్టర్ కిరణ్ గురించి చెప్పాలి. తను ఎంతో ప్యాషనేట్ గా కష్టపడి మూవీ చేశాడు. సినిమా అంటే కిరణ్ కు ప్రాణం. కుటుంబం వల్ల డిస్ట్రబ్ కావొద్దని ఆయన భార్యను కూడా ఊరికి పంపించేశాడు. అంత డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. గెస్ట్ లు ఈవెంట్స్ కు రావడం లేదని కిరణ్ బాధపడినప్పుడు ..సినిమాను నమ్మి చేశాం. 27వ తేదీ మ్యాట్నీ నుంచి మన సినిమా మౌత్ టాక్ తో వెళ్తుంది. ఆ తర్వాత సక్సెస్ తో పాటు గెస్టులూ వస్తారని చెప్పాను. నేను సినిమా సూపర్ హిట్ అని రిలీజ్ ముందు ఎప్పుడూ చెప్పలేదు. ఈ సినిమాకు చెబుతున్నా సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్ కు పేరొచ్చింది. ధర్మ, ఐశ్వర్య జోడి బాగుందంటూ రెస్పాన్స్ వస్తోంది. నాకు డ్రింకర్ సాయి క్యారెక్టర్ బాగా నచ్చింది. హై ఎనర్జిలో ఆ క్యారెక్టర్ పర్ ఫార్మ్ చేస్తుంటుంది. హీరోయిన్ ఐశ్వర్య క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కథగా చూస్తే “డ్రింకర్ సాయి”లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ నెల 27న థియేటర్స్ లో మా సినిమాను చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాలో నేను బాగీ క్యారెక్టర్ చేయగలను అని నాకంటే ఎక్కువగా నమ్మారు డైరెక్టర్ కిరణ్ గారు. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. అలాగే ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. ధర్మ నా కెరీర్ లో చేసిన మొదటి చిత్రానికి హీరో. అతనితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అలాగే మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ సపోర్ట్ అందించారు. “డ్రింకర్ సాయి” సినిమా ఈ నెల 27న మీ ముందుకు వస్తోంది. సినిమాలోని ఎమోషన్, ఫన్ ను మీరంతా ఫీల్ అవుతారు. అన్నారు.
డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ – ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా డైరెక్ట్ చేసి ఈ వేదిక మీద మాట్లాడుతున్నానంటే మా పేరెంట్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ కారణం. ఎన్నో ఏళ్లు ఇండస్ట్రీలో పడిన కష్టానికి ఫలితంగా ఒక మంచి సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఇండస్ట్రీలో మనమంతా బతికేది చిన్న చిత్రాల వల్లే. అవి బాగుంటేనే మనమంతా బాగుంటాం. రివ్యూ రైటర్స్ ను నేను బాగా గౌరవిస్తాను. మీకు మా “డ్రింకర్ సాయి” సినిమా నచ్చకుంటే జీరో రేటింగ్ ఇవ్వండి. కాస్త మీ మనసును కదిలించినా 3 రేటింగ్ ఇవ్వండి. మా సినిమాకు మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డ్స్ తప్పకుండా ధర్మకు వస్తాయి. అంత బాగా తను పర్ ఫార్మ్ చేశాడు. ప్రేక్షకులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా నచ్చితే పదిమందికి చెప్పండి, నచ్చకుంటే వందమందికి చెప్పండి. ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చేసిన సినిమా కాదు. మేమొక కథను నమ్మి జెన్యూన్ గా తెరకెక్కించాం. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఫన్ ఉంటుంది. వంతెన అనే క్యారెక్టర్ ను పెట్టాం. ఆ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైనింగ్ చేస్తూ సాగుతుంది. క్లైమాక్స్ కు వచ్చేసరికి 40 నిమిషాలు అలా చూస్తుండిపోతారు. అంత డెప్త్ ఉంటుంది క్లైమాక్స్ లో. అన్నారు.
హీరో ధర్మ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాను మా ప్రొడ్యూసర్స్ ఎంతో ప్యాషనేట్ గా నిర్మించారు. ఈ సినిమా ప్రొడక్షన్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువని తెలిసినా కథను నమ్మి వారు కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా డబ్బు కోసం కాకుండా సినిమాను ఇష్టపడి వర్క్ చేశారు. నేను హీరో అవుదామనే ఇండస్రీకి వచ్చాను. హీరోగానే బతుకుతాను, హీరోగానే చచ్చిపోతా. హీరో అయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఇది నా డ్రీమ్. చిన్న సినిమాల ట్రైలర్, టీజర్ బాగుంటేనే మీరు థియేటర్స్ కు వస్తారని తెలుసు. మేము ఎంత అడిగినా రారు. “డ్రింకర్ సాయి” సినిమా ట్రైలర్, టీజర్ మీకు నచ్చితే తప్పకుండా ఈ నెల 27న థియేటర్స్ కు రండి. మీకు సినిమా నచ్చితే పది మందికి చెప్పండి. ప్రభాస్ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు. ప్రభాస్ గారిని కలిశాను. ఆల్ ది బెస్ట్ చెప్పి, డ్రింకర్ సాయి సినిమా సక్సెస్ కావాలని మనస్పూర్తిగా చెప్పారు. ఆయన అలా విష్ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అన్నారు.
నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ
స్టిల్స్ – రాజు వైజాగ్ (SVA)
వీఎఫ్ఎక్స్ – సుమరామ్ రెడ్డి.ఎన్
ఆర్ట్ – లావణ్య వేములపల్లి
కొరియోగ్రఫీ – భాను, మోయిన్
డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి
మ్యూజిక్ – శ్రీ వసంత్
లిరిక్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి