తెలంగాణ రాష్ట్ర ఎఫ్డిఎఫ్ కార్యదర్శిగా ఇటీవల కాలంలో నిర్మాత దిల్ రాజు ఎంచుకోబడ్డారు. అయితే ఆ తర్వాత గేమ్ చేంజ్ సినిమా ప్రమోషన్స్ కై అమెరికా వెళ్ళిన నిర్మాత దిల్ రాజు నేడు హైదరాబాద్ తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చిన పిమ్మట పుష్ప 2 చిత్ర విడుదల సమయంలో సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ ను కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ బాలుడి తండ్రికి ఇండస్ట్రీలో ఉద్యోగం కల్పిస్తానంటూ మాటిచ్చారు. అదేవిధంగా అటు ఇండస్ట్రీ తరపు నుండి అలాగే ఇటు ప్రభుత్వం తరఫునుండి ఆయనకు అండగా నిలబడేలా ఉంటామన్నారు. అంతేకాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోరగా రేపు లేదా ఎల్లుండి ఆయనను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.