పుష్ప 2 సినిమా విడుదల సమయంలో హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన అందరికి తెలిసిందే. అయితే ఆ సంఘటనలో గాయపడిన బాలుడు ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లడం జరిగింది. శ్రీ తేజ తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయల చెక్ అందజేశారు. అదేవిధంగా ఆ కుటుంబానికి అన్ని విధాల సాయం అందజేస్తారని హామీ ఇవ్వడం జరిగింది.