వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రైటర్ మోహన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. దర్శకుడు మోహన్ మాటల్లో సినిమా గురించి….
- సినిమా 7 మందికి సంబంధించిన కథ. వెన్నెల కిషోర్ ఇలాంటి కేరక్టర్ చేస్తే బావుంటది అనుకుని చేశాం.
- 1991లో జరిగే ఒక కథ. రాహుల్ గాందీ చనిపోయిన సమయంలో జరిగిన ఒక కథ.
- చంటబ్బాయ్ తాలూకా అనేది ముందు నుండి లేదు. కాకపోతే కామెడీగా ఉండాలి. షెర్లాక్ హోమ్స్ అంటే ఇక్కడ అందరికీ తెలీదు. అందుకే చంటబ్బాయ్ అని చిరంజీవి గారి సినిమాని తీసుకుని అలా ట్యాగ్ పెట్టుకున్నాం.
- ఆర్టిస్ట్ అందరూ ఒక చాలెంజ్ గా తీసుకుని శ్రీకాకుళం భాష, యాస నేర్చుకున్నాను. ముందు నుండి చాల ప్రాక్టీస్ చేసి సినిమా తీశాం.
- ఇప్పుడు ప్రతి ప్రాంతం నుండి హీరోలు వచ్చారు. అలాగే శ్రీకాకుళం భాష కూడా ఇప్పుడు మంచి ఆదరణ పొందుతోంది.
- షెర్లాక్ హోమ్స్ ఎవరు అనేది సినిమాలో వెన్నెల కిషోర్ కు తెలీదు. చిత్రంలో వెన్నెల కిషోర్ కు తల్లితండ్రులు తన అసిస్టెంట్స్.
- సినిమాలో ప్రతి కేరక్టర్ కు ప్రత్యేకత ఉంటుంది.
- ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో సంబంధం ఉండదు. సందర్భాన్ని బట్టి కామెడీ ఉంటుంది.
- సినిమాలో లాజిక్స్ ఉంటాయి. కాని లాజిక్స్ వెతుకుతూనే ఉండకండి అని తర్కం విడిచి చిత్రం చూడండి అని వేసాము.
- వెన్నెల కిషోర్ ఈ సినిమాలో హీరో అని చెప్పలేము. ఒక కేరక్టర్ అని చెప్పుకోవాలి.
- సినిమాలో ఆర్ఆర్ దగ్గర ఉండి చేయించుకున్నాను. అలాగే డబ్బింగ్ కూడా అందరికీ అర్ధం అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాము. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా చాల జాగ్రత్త తీసుకున్నాం.
- సినిమాలో సంగీతం విషయానికి వస్తె జ్ఞాని సినిమాకు ఆర్ఆర్ చేయగా సునీల్ కాశ్యప్ పాటలకు సంగీతాన్ని అందించారు.
- గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో రైటర్స్ ఎక్కువ అయిపోయారు.
- నేను కామెడీ, ఎమోషన్ బాగ చేస్తాను. అదే నా బలం. సినిమాలో కూడా మంచి ఎమోషన్ చాల బాగ ఉంటుంది.
- జీవితంలో కొంచం స్థిరపడిన తరువాతే సినిమాలలోకి వచ్చాను.