పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టేల్‌‘హంట్ – యాస్పరింగ్ రైటర్స్ కి అవకాశం

హైదరాబాద్: క్రియేటివ్ ట్యాలెంట్ ని ప్రోత్సహించే లక్ష్యంతో టేల్‌‘హంట్ అనే సరి కొత్త స్టోరీ రైటింగ్ కాంపిటేషన్ ని డిసెంబర్ 11న సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. వర్ధమాన కథకులు, ఔత్సాహిక రచయితలకు ఈ ఈవెంట్ ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని అని ప్రకటించారు.

డ్రామా, కామెడీ, రొమాన్స్, జానపద కథలు, కోర్ట్‌రూమ్ డ్రామాలు, యాక్షన్, ఫాంటసీతో సహా పలు రకాల థీమ్స్ లో, ఇంగ్లీష్ లేదా తెలుగులో ప్రభావంతమైన కథనాలను రాయగల వారు ఈ పోటీలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నారు. కథలు 4 పేజీలకు మించకూడదు, పంపించే కథలు తప్పనిసరిగా ఒరిజినల్, ఇంతకముందు ఎన్నడూ, ప్రచురించబడనివిగా ఉండాలి.

నిర్వాహకులకు ఈ కాంపిటేషన్ గురించి మాట్లాడుతూ..ఈ పోటీ ప్రతిభను గుర్తించడం మాత్రమే కాకుండా రచయితలు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ఎంటర్ టైన్మెంట్ పరిశ్రమలోని నిపుణులతో సమర్థవంతంగా పనిచేసే అవకాశం కలిగిస్తుంది అని చెప్పారు

ఈ ఈవెంట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేయడానికి, PMFలో సీనియర్ టెక్నిషియన్స్ దగ్గర నుండి ఎంతో నేర్చుకోడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది అని తెలియచేశారు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొండి, త్వరపడండి! ఎంట్రీలకు చివరి తేదీ డిసెంబర్ 16.

మరింత సమాచారం కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా హ్యాండిల్స్ బ్రౌజ్ చేయండి.