‘ఫియర్’ సినిమా రివ్యూ

దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై హరిత గోగినేని రచన దర్శకత్వంలో ఏఆర్ అభి నిర్మాతగా సుజాత రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తూ డిసెంబర్ 14వ తేదీన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఫియర్. అయితే 12వ తేదీ సాయంత్రం నుండి ఈ చిత్రానికి పలుచోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేయడం మొదలుపెట్టారు మేకర్స్. వేదిక, అరవింద్ కృష్ణ జంటగా ప్రధాన పాత్రలో నటిస్తుండగా జయప్రకాష్, పవిత్ర లోకేష్, సయాజి షిండే, సత్య కృష్ణన్, అనీష్ కురువిల్లా, సాహితీ దాసరి తదితరులు కీలకపాత్రలో నటించిన జరిగింది. ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా ఆండ్రూ సినిమాటోగ్రఫీ చేశారు. ఇక ఈ చిత్రం ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ:
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఫియర్ చిత్రం కథ విషయానికి వస్తే టైలర్ లో చూపించినట్లు వేదిక ఎంతో భయపడుతూ ఉంటుంది. ఆ భయానికి గల కారణం ఏంటి అనేది తమ కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తనను అడుగుతూ ఉండగా తనని ఎవరు ఫాలో చేస్తూ ఉన్నట్లు చెబుతూ వస్తుంది. అయితే నిజంగానే చిత్రంలో వేదికను ఎవరైనా ఫాలో అవుతున్నారా? తనను ఎవరైనా చంపాలని చూస్తున్నారా? లేదా తానే కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రవర్తిస్తుందా? అసలు అరవింద కృష్ణ వేదికకు ఎంతవరకు సపోర్టుగా నిలిచాడు? ఈ చిత్రం కొన్ని కథనాలను బేస్ చేసుకుని తీసిన సినిమాగా ట్యాగ్ ఉంది. ఎంతవరకు నిజాలు ఉన్నాయి? ఎంతవరకు కల్పితం? వేదిక మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రశ్నలు అన్నిటికి సమాధానం తెలియాలి అంటే కచ్చితంగా వెండి తెరపై ఈ సినిమాను చూడాల్సిందే.

నటీనటుల నటన:
ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి అయిన వేదిక తన పూర్తి పెర్ఫార్మెన్స్ ఇస్తూ ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ ను మిస్ కాకుండా తనదైన శైలిలో చాలా బాగా నటించారు. అదేవిధంగా అరవింద కృష్ణ ఇప్పటికే మంచి మంచి పాత్రలను చేసిన విషయం తెలిసింది. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తన క్యారెక్టర్ ను పోట్రే చేయడంలో విజయం సాధించాడు. అలాగే చిత్రంలో వేదిక స్నేహితురాలిగా నటించిన సాహితీ దాసరి తనకు ఇచ్చిన పాత్రను తన పరిధిలో నటిస్తూ న్యాయం చేశారు. అదేవిధంగా జయప్రకాష్, పవిత్ర లోకేష్, సయాజి షిండే, సత్య కృష్ణన్ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తూ తమ పాత్రలకు తామే ప్రాణం పోస్తూ నటించడం జరిగింది.

ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టులు విషయానికి వస్తే వారు ఈ చిత్రంలో నటించిన వారిలో ప్రధానంగా చెప్పవలసినవారు. ఎందుకంటే తమ తమ క్యారెక్టర్ లను వారు క్యారీ చేస్తూ, వయసుతో సంబంధం లేకుండా ఎంతో అనుభవజ్ఞుల వలె నటించడం జరిగింది. ఈ చిత్రం ఆ చైల్డ్ ఆర్టిస్టులు అందరికీ ఎంత ఉపయోగకరంగా నిలిచేలా కనిపిస్తుంది.

సాంకేతిక విశ్లేషణ:
ఈ చిత్ర సాంకేతిక బృందం అనగానే ముందుగా హరిత గోగినేని గురించి మాట్లాడాలి. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం మాత్రమే కాకుండా ఎడిటింగ్ కూడా ఆమెనే చేసి తనదైన శైలిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు విభిన్న రూపంలో తీసుకుని రావడం జరిగింది. తన కథను తానే దర్శకత్వం వహిస్తూ ఓ మహిళ ఇటువంటి సస్పెన్స్ టర్లను తీయడం విశేషం. అయితే ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ చేసినప్పటికీ ఇటువంటి కథ అలా స్లోగా వెళ్తేనే ప్రేక్షకులకు అర్థమవుతుందని విషయాన్ని ముందుగానే గ్రహించి ఆ విధంగా సినిమాను రూపుదిద్దడం జరిగింది. అదేవిధంగా నిర్మాణం విలువలలో ఎక్కడ కాంప్రమైస్ కాకుండా ఉన్నట్లు అర్థమవుతుంది. బిజిఎం అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ మొత్తంగా చూస్తే ఇటువంటి కథకు తగ్గట్లు సరైన సంగీతాన్ని అందించారు అనూప్ రూబెన్స్. అలాగే ఇతర సాంకేతిక సంబంధిత అన్ని కోణాలలోనూ కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రాన్ని అద్భుతంగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకునే రావడం జరిగింది.

ప్లస్ పాయింట్స్:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటీనటుల నటన, నిర్మాణ విలువలు.

మైనస్ కాయిన్:
ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్.

సారాంశం:
సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టంగా చూసేవారికి ఫుల్ మీల్స్ గా ఈ చిత్రం ఉంటుంది. ఎటువంటి అడల్ట్రీ లేకుండా కుటుంబంతో సహా కలిసి చూసే చిత్రం ఫియర్.