ఇటీవలే డిసెంబర్ 5వ తేదీన ‘పుష్ప 2’ విడుదలైన సందర్భంగా ఒకరోజు ముందు డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుండి కొన్ని ప్రియమైన షోలు వేయడం జరిగింది. అదే తరహాలో హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో వేయడం జరిగింది. ఆ షోకు అల్లు అర్జున్ వెళ్లిన సందర్భంలో ప్రేక్షకులు ఎక్కువగా ఉన్న కారణంగా తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో దురదృష్టం కొద్దీ ఒక్కటే కుటుంబానికి సంబంధించిన మహిళ చనిపోగా, అదే కుటుంబంలో ఆమె కుమారుడు గాయపడడం జరిగింది. ఇది జరిగిన రెండవ రోజు ఈ ఘటన పై స్పందిస్తూ అల్లు అర్జున్ తమ కుటుంబానికి అండగా ఉంటానని, వారికి ఆర్థికంగా 25 లక్షలు సహాయం చేస్తానని, అదేవిధంగా వారి పూర్తి వైద్య ఖర్చులు తామే చూసుకుంటామని అల్లు అర్జున్ వెల్లడించారు. పరిస్థితి సర్దుబడిన తర్వాత తానే పర్సనల్గా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం అల్లు అర్జున్ తన నివాసంలో ఉండగా పోలీసులు అల్లు అర్జున్ ను ఎంక్వయిరీ చేయడం కోసం పోలీసులు వచ్చి తీసుకుని వెళ్లడం జరిగింది. బిఎన్ఎస్ 118, 105 సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్ ఈ సంఘటన నిమిత్తం ఎంక్వైరీ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. తదుపరి విషయాలు తెలియాల్సి ఉంది.