ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 1000 కోట్లకు పైగా వసూలు చేసి ఇంకా అదే వేగంతో దూసుకుని వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఆ చిత్రంలోని కొన్ని సీన్స్ కొంతమంది ప్రేక్షకులను ఇన్స్పైర్ చేసే విధంగా ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇందర్గంజ్ ప్రాంతంలో కైలాష్ టాకీస్ లో అటువంటి ఓ సంఘటన జరిగింది. ఈ చిత్రంలో క్లైమాక్స్ ఫైట్ జరుగుతుండగా అల్లు అర్జున్ పీక కొరికి కొంత మంది శత్రువులను చంపుతాడు. అయితే ఇంటర్వెల్ టైంకి ఈ చిత్రం చూడడానికి వెళ్లిన ఓ వ్యక్తి క్యాంటీన్లో స్నాక్స్ తీసుకునే సందర్భంలో క్యాంటీన్ ఓనర్ కు, కస్టమర్ కు ఒక ఘర్షణ జరిగింది. ఆకర్షణలో భాగంగా క్యాంటీన్ లో పనిచేస్తున్న రాజు, చందన్, ఇది తెలిసిన ఎంఏ ఖాన్ తో ఈ గొడవ కాస్త పెద్దది కాగా కస్టమర్ సభ్యుడు ఆ ముగ్గురు కలిసి కొట్టి వారిలో ఒకరు కస్టమర్ చెవి కొరికాడు. అయితే ఈ గొడవ జరిగిన అనంతరం పోలీస్ స్టేషన్ కు ఆ కస్టమర్ చేరుకుని వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసులు అతడికి వైద్య పరీక్షలు చేయించి, ఆ ముగ్గురిపై బిఎన్ఎస్ సెక్షన్లో 294, 323, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. గాయపడిన షబ్బీర్ మెడికల్ రిపోర్ట్ వచ్చిన వెంటనే వాడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.