సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్ విడుదల సమయంలో హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్దకు ప్రీమియర్ షోస్ ద్వారా అభిమానులు ఎక్కువగా సినిమా చూడడానికి రావడం జరిగింది. అదే సమయానికి అల్లు అర్జున్ ఆ థియేటర్ కి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో కొంతమంది గాయ పడగ ఓ బాలుడు ఆసుపత్రి పాలు కావడం జరిగింది. అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్న విషయం తెలిసి దానికి తగ్గట్లు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోకుండా సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండటంవల్ల ఈ సంఘటన జరిగిందని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సంధ్య థియేటర్ యాజమాన్యానికి అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసిన కూడా సమయానికి పోలీసులకు బాధ్యతా రహితంగా ఈ సమాచారాన్ని ఇవ్వకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది అని సెక్షన్ 105, 118 బి.ఎన్.ఎస్ యాక్ట్ ప్రకారం అల్లు అర్జున్ టీం పై కూడా కేసు నమోదు కావడం జరిగింది.

కాగా ఈ ఘటనపై స్పందిస్తూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియా X ద్వారా జరిగిన ఘటనకు ఎంతో బాధపడుతున్నట్లు, ఆ కుటుంబానికి తమ అండగా ఉంటాం అంటూ తెలియజేశారు.