కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ జంటగా మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జీవి అజయ్ కుమార్ సినిమా ఫోటోగ్రఫీ చేస్తూ కార్తీక్ కొడగండ్ల సంగీతం అందించిన చిత్రం ఉద్వేగం. ఈ చిత్రంలో త్రిగున్ కథానాయకుడిగా దీప్సిక కథానాయకగా శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ఈయన 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
జగన్ ఓ లాయర్ గా దీప్సికతో వివాహానికి సిద్ధంగా ఉన్న సమయంలో తనకి వృత్తిపరంగా ఒక కేసు రావడం జరుగుతుంది. ఆ కేసులో ఒక అమ్మాయికి అన్యాయం జరగదు నలుగురు వ్యక్తులు దోషులుగా ఉంటారు. అయితే అసలు అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగిందా లేదా? ఒకవేళ జరిగితే దానికి కారణమైన వాళ్ళు ఎవరు? కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడిందా లేదా ఎవరైనా తప్పించుకున్నారా? ఈ కేసులోకి శ్రీకాంత్ అయ్యంగార్ ఎందుకు వచ్చారు? హీరో త్రిగున్ ఎవరి తరఫున లాయర్ గా వాదించాడు? త్రిపుల్, శ్రీకాంత్ కోర్టు సన్నివేశాలు ఎంతవరకు ప్రేక్షకుడి మెప్పించాయి? ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కచ్చితంగా ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఈ చిత్రంలో త్రిగున్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇద్దరు లాయలుగా పోటాపోటీగా నటించడం జరిగింది. వారి మధ్య డైలాగ్స్, సన్నివేశాలు ఎంత ఉత్కంఠంగా సాగాయి. వారి పాత్రలలో వారు నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పవచ్చు. దీప్సిక తన పరిధిలో తను నటించింది. సురేష్, పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగానే తమ వంతు పాత్రలలో ప్రాణం పోస్తూ నటించారు.
సాంకేతిక విశ్లేషణ:
ఈ చిత్రం తెరకు ఎక్కించడంలో మహిపాల్ రెడ్డి విజయం సాధించాడు. చిత్ర కథ గాని తన దర్శకత్వం గానీ మంచి మార్కుగా నిలిచాయి. ఇంట్లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండటంతో ఎక్కడ బోర్ అనిపించదు. చిత్రంలోని డైలాగులు సన్నివేశాలకు తగ్గట్లు చాలా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ అంతగా లేనప్పటికీ కథ ఇంటెన్సిఫైడ్ గా ఉండటం వల్ల మనకు ఒకే షాపు లాంటి సినిమాను చూస్తున్నట్లు కనిపించింది. తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలో ఎక్కడ కాంప్రమైస్ కానట్లు అర్థమవుతుంది.
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, నటీనటులు నటన.
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్.
సారాంశం:
ఈ మధ్యకాలంలో ఇటువంటి కోర్టు నేపథ్యంలో సినిమా రాలేదు. ఇటువంటి సంఘటనలు సమాజంలో చూస్తూ ఉంటాం కాబట్టి చిత్రం ఆకర్షణీయంగా నిర్వహించింది. కుటుంబంలో సహా ఇంట్రెస్టింగ్ గా కూర్చుని చూసే సినిమాగా చెప్పవచ్చు.