తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు దగ్గరగా కేశవ చంద్ర రమావత్ (కెసిఆర్) అనే టైటిల్ తో విభూతి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇది. గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ ఇంకా దర్శకత్వం చేయగా రాకింగ్ రాకేష్ స్క్రీన్ ప్లే, దర్శకుడిగా పనిచేశారు. రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించగా మైమ్ మధు, లోహిత్, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత, తనికెళ్ల భరణి, ధనరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈనెల 22వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది అనేది చూద్దాం.
కథ:
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ చుట్టుపక్కల ప్రాంతంలో ఓ తాండకు చెందిన వ్యక్తి రాకింగ్ రాకేష్. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ పేరు ఎంత ఘన వినిపిస్తున్న సమయంలో తన పేరు కేశవ చంద్ర రమావత్ కావడంతో అతనిని కూడా కేసీఆర్ అని అందరూ పిలుస్తూ ఉండేవారు. కెసిఆర్ ఉద్యమస్ఫూర్తి, కెసిఆర్ పోరాటం చూస్తూ పెరిగిన అతనికి కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. అయితే ఎలాగైనా కష్టపడి తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఒక మెట్టు పైకి ఎదిగేలా చూసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అదే ఊరిలో తన మరదలైన అనన్య కృష్ణన్ ను అందరూ పెళ్లి చేసుకోమనగా బాగ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది తన కుటుంబ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని తాను మరదలని చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఆ తర్వాత అదే ఊర్లోని ఒక ఆసాని కూతురును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కాకపోతే తన పెళ్లికి కెసిఆర్ ను అతిథిగా తీసుకువస్తానని పట్టు పట్టి హైదరాబాద్ రావడం జరుగుతుంది. అయితే హైదరాబాదులో తాను ఎటువంటి కష్టాలు పడతాడు? రింగ్ రోడ్డు వల్ల తన ఊరికి ఎటువంటి ప్రమాదం వస్తుంది? చివరికి కేసీఆర్ ను తన ఊరికి తీసుకుని వెళ్తాడా? చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటులు నటన:
రాకింగ్ రాకేష్ ఇప్పటివరకు జబర్దస్త్ లో కామెడీ చేసే కోణంలోని కనిపించారు. కానీ ఈ చిత్రంతో తన పూర్తిస్థాయి నటనను మనం చూడడం జరుగుతుంది. ఎమోషన్ సీన్స్ నుండి మొదలుకొని ప్రతి ఒక్క సీన్ ను, ఎక్స్ప్రెషన్ను ఎంతో బాగా చేస్తూ రాకేష్ నటించారు. అనన్య హీరోయిన్గా ఓ తాండ అమ్మాయిగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా మైమ మధు, లోహిత్ తమ పరిధిలో తాము నటించారు. తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత ఇద్దరు జంటగా కామెడీ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యారు. అలాగే చిత్రంలో నటించిన ధనరాజ్, తనికెళ్ల భరణి తదితరుల నటన ఈ చిత్రానికి మంచి ప్లస్ పాయింట్ గా నిలిచింది.
సాంకేతిక విశ్లేషణ:
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఇంకా దర్శకుడు గరుడవేగ అంజి కావడం చిత్రానికి ప్లస్ అయింది. తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలలో ఎటువంటి తడబాటు లేకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే చిత్రంలోని పాటలు, సన్నివేశాలకు దగ్గరికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ తో ప్రేక్షకులను మెప్పించాయి. స్క్రీన్ మీద కూడా ఎక్కువ లాగ్ లేకపోవడం వల్ల ఎక్కడ బోర్ కొట్టే ఫీలింగ్ లేదు.
ప్లస్ పాయింట్స్:
కథ, సాంగ్స్, బిజీఎం, నటీనటులు నటన.
మైనస్ పాయింట్స్:
కొన్ని సీన్లు దగ్గర కొంచెం లాగ్ అనిపించడం, కొద్దిపాటి టేకింగ్ మిస్టేక్లు ఉండటం.
సారాంశం:
అటు కేసీఆర్ అభిమానిగానే కాకుండా, ఓ అమ్మాయి ఒక పల్లెటూరి కుర్రాడి కథగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించే విధంగా ఈ చిత్రం ఉంది. ఎమోషన్స్ తో కూడిన కథ కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి చేసే విధంగా ఈ చిత్రం ఉంది.