ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజనీ తాళ్లూరి నిర్మాతగా రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మెకానిక్ రాకి. విశ్వక్ సేన్ కథానాయకుడుగా మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికలుగా సునీల్, వికె నరేష్, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ తదితరులు కీలకపాత్రలో నటించడం జరిగింది. జేక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా మనోజ్ రెడ్డి కరసాన్ని డిఓపిగా వ్యవహరించడం జరిగింది. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
హైదరాబాదులోని ఓ సామాన్య మెకానిక్ కథ ఇది. ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్న మెకానిక్ రాకీ హీరో విశ్వక్ సేన్. సాఫీగా సాగిపోతున్న తన జీవితంలోకి కొన్ని అనుకుని సంఘటనలు వస్తాయి. తద్వారా తన గ్యారేజ్ కు ఇబ్బంది వస్తుంది. చిత్రంలో ఎన్నో అనుకొని మలుపులు, ట్విస్టులు కూడి ఉండడంతో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ ఉండేలా ఈ చిత్రం ఉంది. తను ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కొంటాడు? ఈ కథలోకి సునీల్ ఎలా వస్తారు? రాఖీ కి ఎవడు ఎలా హెల్ప్ అవుతారు? అనే విషయం తెలియాలంటే థియేటర్లో ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
చిత్రంలో మాస్ మెకానిక్ గా విశ్వక్సేన్ చాలా బాగా నటించారు. విశ్వక్ సేమ్ ఎలివేషన్స్ ఇంకా డైలాగ్స్ కూడా తనకు తగ్గట్లు పడటంతో ఈ క్యారెక్టర్ చాలా కచ్చితంగా రావడం జరిగింది. అదేవిధంగా మీనాక్షి చౌదరి తన పాత్రకి తగట్లు తన పాత పరిధిలో నటించారు. శ్రద్ధ శ్రీనాథ్ కొంచెం గ్లామర్ గా అలాగే తన పాత్రకు తగ్గట్లు కొంచెం మోడ్రన్ గా ఎంతో బాగా నటించారు. అదేవిధంగా వైవా హర్ష, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్లు న్యాయం చేశారు. పాత్రలలో కొన్ని గ్రే క్యారెక్టర్స్ ఉండటం విశేషం.
సాంకేతిక విశ్లేషణ:
చిత్ర దర్శకుడు రవితేజ కథా దర్శకత్వం విజయం సాధించిందని చెప్పుకోవాలి. చిత్రానికి తగ్గట్లు పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి ప్లస్‌గా మారాయి. మొదటి హాఫ్ తో పోలిస్తే రెండవ భాగం కొంచం సాగినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడ విశ్వాక్ సేన్ విషయంలో కంటిన్యూటి తప్పిదాలు ఉన్నట్లు అనిపించాయి. నిర్మాణ విలువలతో ఎక్కడ కాంప్రమైజ్ కానట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. స్క్రీన్ ప్లే, డబ్బింగ్ ఎక్కడ మిస్టేక్ రాకుండా జాగ్రత్త పడినట్లు అర్థం అవుతుంది.
ప్లస్ పాయింట్స్:
కథ, నటీనటుల నటన, నిర్మాణ విలువలు, సంగీతం.
మైనస్ పాయింట్స్:
రెండవ భాగం కొంచెం సాగతేయడం, అక్కడక్కడ కంటిన్యూటి తప్పులు.
సారాంశం:
అనుకోని ట్విస్టులతో మంచి కిక్ ఇచ్చే చిత్రంగా మెకానిక్ రాఖీ తెరకెక్కింది. కుటుంబ సమేతంగా వెళ్లి చూసి విధంగా ఈ చిత్రం ఉంది. సీట్ ఎడ్జ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఈ వారం థియేటర్లో హంగామా చేస్తుంది.