తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఆ లేఖలో ప్రత్యేకంగా ప్రీమియర్ షోల గురించి పేర్కొన్నారు. అభిమానులు ప్రీమియర్ షోలు చూసినప్పుడు ఆ సినిమాల గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఇంటర్వ్యూలు, రివ్యూలు పేరిట కొన్నిసార్లు సినిమాలు దుర్భాషలాడుతూ, అలాగే వ్యక్తిగతంగా కూడా దూషిస్తూ మాట్లాడడం జరిగింది. ఇండియన్ 2, వేట్టాయన్ అలాగే ఇటీవలే కొంగువ సినిమా గురించి ఇటువంటి కొన్ని సంఘటనలు జరిగాక తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జర్నలిస్టులు సినిమాను చూసి రివ్యూ చెప్పడం వరకు సమంజసమే కానీ అది వారి హక్కు అంటూ మితిమీరి దుర్భాషలాడుతూ, లేదా వ్యక్తిగత దూషణలు చేయడం తప్పు అని ఆ లేఖలో పెరగడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షోలు అమలులో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ రివ్యూస్ వంటివి బ్యాన్ చేయాలంటూ థియేటర్ ఓనర్లను ప్రొడ్యూసర్ కౌన్సిల్ కోరడం జరిగింది.