మా కుటుంబం గురించి నేను కచ్చితంగా మాట్లాడుతాను : వరుణ్ తేజ్

వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాల్లూరి నిర్మిస్తూ కరుణ్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మట్కా. వరుణ్ తేజ్ కథానాయకుడుగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయకగా జీవి ప్రకాష్ సంగీతం అందజేస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈనెల 14వ తేదీన విడుదలకు సిద్ధమైంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ గా జరిగే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లోని చేయడం మరో విశేషం.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ తన కుటుంబం తనకు ఎంతో సపోర్టుగా నిలిచారని ఆయన తెలిపారు. తన సతీమణి లావణ్య తనకు అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు. అదేవిధంగా తన అన్న రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ తన అన్న తనకు కొండంత ధైర్యం అని అన్నారు. అంతేకాక తన అన్న ఒక్క మాట తనకు 100 కోట్లు ఆస్తి అన్నట్లుగా చెప్పారు. అదేవిధంగా తన పెదనాన్న చిరంజీవి ఇంకా బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. వారి కుటుంబం గురించి తను ఎక్కడికి వెళ్ళినా మరవనని, తను ఆ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం వారే అని వరుణ్ తేజ్ అన్నారు.

అంతే కదా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిన విధానం గురించి అడగగా అది వారి ఇంట్లో చాలా మామూలుగా జరిగే విషయం అని, తన కుటుంబంలో మొదటి నుండి పెద్దవారికి అదే విధంగా అందరూ గౌరవిస్తారని వరుణ్ తేజ్ తెలిపారు. చిన్నప్పటినుండి మా కళ్యాణ్ బాబాయ్ నేను చూస్తూనే పెరిగాను. బాబాయ్ మా పెదనాన్న చిరంజీవి గారికి మొదటినుండి ఎంతో గౌరవం ఇస్తారని, అలా నమస్కరించడం ఎప్పుడు జరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ఆ విధంగా వరుణ్ తేజ్ తన కుటుంబ విలువలు ఎలా ఉంటాయనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మరోసారి వరుణ్ తేజ్ తెలపడం జరిగింది.