డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ పథకంపై కంచి షర్మిల ప్రెసెంట్ చేస్తూ రంగారావు తోట, రజినీకాంత్ పున్నపు నిర్మాతలుగా కంచి రామకృష్ణ దర్శకత్వంలో ఈ నవంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది షార్ట్ కట్. ఆట సందీప్, శగ్న ప్రధాన పాత్రలలో ఈటీవీ ప్రభాకర్, రాకేష్ మాస్టర్, లోబో, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలో నటిస్తూ ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆర్ఆర్ దృవన్ సంగీతాన్ని అందించగా ఎస్ఎన్ మీరా చీమటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇక ఈ చిత్రం ఎలా ఉంది తెలుసుకుందాం.
కథ:
దర్శకుడు కావాలి అనే ఆశయంతో హైదరాబాద్ లో యువకుడు ప్రయత్నంగా ఈ ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ఆట సందీప్ దర్శకుడు కావాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన దగ్గర ఉన్న కథను ఓ వ్యక్తిని నమ్మి అతని చేతిలో పెట్టగా అతడు సందీప్ ను మోసం చేయడం జరుగుతుంది. అప్పటికే సందీప్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఈ విషయం తెలిసిన తన ప్రేయసి ఇంకా ఎంతకాలం అని ఇలా నీకోసం వేచి ఉండాలి, సినిమా ఇండస్ట్రీలో గ్యారంటీ ఉండదు అంటూ తనపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెడుతుంది. అయితే అదే సమయంలో నగరంలో మత్తు పదార్థాలకు సంబంధించి కొన్ని అసాంఘిక చర్యలు జరుగుతూ ఉంటాయి. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తూ మాఫియాను అంతం చేయాలని నేపథ్యంలో ఉంటారు. అదే సమయంలో మోసపోయిన సందీప్ ఎలాగైనా తన సినిమాలు తానే నిర్మించుకోవాలి అనుకొని షార్ట్ కట్ లో ఆ డ్రగ్స్ ద్వారా సొమ్ము చేసుకోవాలనుకుంటారు.
ఈ క్రమంలో హీరో ఆ తర్వాత దర్శకుడు కావడానికి ఎటువంటి కష్టాలు పడ్డారు? ఆ ప్రక్రియను తాను ఎటువంటి చాలెంజ్‌లు ఎదుర్కొన్నాడు? తన జీవితంలోకి మత్తు పదార్థాలు ఎలా వచ్చాయి? ఆ తరువాత తన జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది? చివరిగా తన ఆశయమైనటువంటి దర్శకత్వం చేశాడా లేదా? తన ప్రేయసితో వివాహం జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
నటినటుల నటన:
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు పూర్తిస్థాయిలో తమ ప్రదర్శనలు చూపించడం జరిగింది. అయితే చిత్రంలో కొంతమంది తెలిసినవారైనప్పటికీ చాలావరకు కొత్త ఆర్టిస్టులు ఉండటం ఒక చిన్న మైనస్ గా చెప్పుకోవచ్చు. కానీ వారి పాత్రలోకి తగ్గట్లు నటిస్తూ వారి పాత్రలకు ఆర్టిస్టులు ప్రాణం పోశారు. కొంతమంది కొత్త ఆర్టిస్టులు ఉన్నప్పటికీ దర్శకుడు వారిని వాడుకోవడంలో పూర్తిగా సఫలం అయ్యారని చెప్పుకోవచ్చు.
సాంకేతిక విశ్లేషణ:
ఈ చిత్రం గురించి చెప్పుకోవాలంటే ముందుగా కథ ఇంక దర్శకత్వం గురించి మాట్లాడుకోవాలి. దర్శకుడు తనకు ఉన్న రిసోర్సెస్ లో ప్రతిదీ వాడుకోవడం జరిగింది. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ మంచి నిర్మాణంతో ఈ చిత్రాన్ని చిత్రీకరించిన జరిగింది. మొదటి భాగంతో పోలిస్తే సినిమాలోని రెండవ భాగం కొంచెం లాగ్ ఉన్నట్లు అనిపిస్తుంది. చిత్రం పూర్తిగా హైదరాబాదులో షూటింగ్ చేయడంతో హైదరాబాదులో నిర్వహించే వారికి ఎంతో బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అంతేకాకుండా చాలా వరకు లొకేషన్లు సెట్స్ లేకుండా తీయడంతో చిత్రం చాలా న్యాచురల్ గా అనిపించింది. చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో ఇంటెన్సిటీని వచ్చేలా చేశాయి. స్క్రీన్ ప్లే చాలా చక్కగా కుదిరింది. అంతేకాక చిత్రంలోని చాలా సీన్లు రాత్రి పూట కావడంతో కలరింగ్ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ లైటింగ్ లో ఎటువంటి తప్పిదాలు లేకుండా చూసుకోవడంలో దర్శకుడు జగరతపడ్డాడు అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
కథ, నటీనటుల నటన, స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్.
మైనస్ పాయింట్స్:
కొత్త ఆర్టిస్టులు, సెకండ్ హాఫ్ లాగ్.
సారాంశం:
ఎంతో థ్రిల్ కలిగిస్తూ సస్పెన్స్ లు, యాక్షన్ అలాగే ఎమోషన్ క్యారీ చేస్తూ ఈ చిత్రం పూర్తిగా ప్రేక్షకుడను తృప్తి పరిచే విధంగా ఉంది.