“జితేందర్ రెడ్డి” సినిమా రివ్యూ

ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ముదిగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా ఉమా రవీందర్ సహనిర్మాతగా ఉంటూ ఉయ్యాల జంపాల, మజ్ను వంటి సినిమాలను దర్శకత్వం చేసిన విరించి వర్మ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా జితేందర్ రెడ్డి. ఈ సినిమాకు వీఎస్ జ్ఞాన శేఖర్ సినిమా పనిచేయక గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. రాకేష్ వర్రె టైటిల్ పాత్రను పోషించగా వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రుడు పోషించారు. 1980లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జగిత్యాల చుట్టుపక్కల జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం వచ్చింది. నవంబర్ 8వ తేదీన విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:
ఈ చిత్ర కథ విషయానికి వస్తే 1980 నాటి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని జగిత్యాల చుట్టుపక్కల జరిగిన కొన్ని యథార్థ సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీయడం జరిగింది. అప్పట్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో నక్సలైట్ల ఉనికి ఎక్కువగా ఉండేది. వాడి వల్ల పీడించబడుతున్న పేదవారికి అండగా నిలుస్తూ నక్సలైట్లను ఎదిరించి నిలబడిన జితేందర్ రెడ్డి అనే ఓ వ్యక్తి జీవిత సంఘటనలను ఆదాయం చేసుకుని ఈ సినిమా తీయడం జరిగింది. అయితే నక్సలైట్లు అక్కడ ఉన్నవారికి చేసిన అన్యాయం ఏంటి? వారి వల్ల ఎవరు ఎంతగా నష్టపోయారు? వారిని జితేందర్ రెడ్డి ఎలా ఎదుర్కొన్నాడు? చివరిగా ఏం జరిగింది? నాటి ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాయి? అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

నటీనటుల నటన:
ఈ చిత్రంలో రాకేష్ వర్రె టైటిల్ పాత్ర జితేందర్ రెడ్డి చేయడం జరిగింది. చిత్రంలోని ఈ పాత్ర ఓ వ్యక్తిని ప్రతిబింబిస్తూ ఉండాలి. పాత్రను పోషించిన రాకేష్ వర్రే నాటి జితేందర్ రెడ్డి గారి నడక దగ్గర నుండి మాట తీరు వరకు ప్రతిది తాను ప్రతిబింబిస్తూ నటించడం జరిగింది. నటనాపరంగా కూడా రాకేష్ వర్రె చాలా బాగా నటించారు. అలాగే ఈ చిత్రంలో వేరే వేరే పాత్రను నటించిన చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ తమ పాత్రలతో ఆనాటి మాట తీరు అలాగే డ్రెస్సింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించిన వైశాలి రాజ్, రియా సుమన్ తమ పాత్రలు ఎంతో బాగా చేశారు. అంతేకాకుండా ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ అటు 1980ల కాలంనాటి భాష, వేషధారణ కచ్చితంగా వచ్చేలా ఎంతో బాగా నటించడం జరిగింది.

సాంకేతిక విశ్లేషణ:
ఈ చిత్ర దర్శకుడు విరించి వర్మ గతంలో కేవలం ప్రేమ కథలను మాత్రమే దర్శకత్వం చేశారు. అయినప్పటికీ యదార్థ సంఘటనల ఆధారంగా తీస్తూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎంతో బాగా దర్శకత్వం చేశారు. అక్కడక్కడ కొన్ని గ్రాఫిక్స్ కు సంబంధించిన తప్పిదాలు జరిగినప్పటికీ చాకచక్యంగా ఈ చిత్రాన్ని దర్శకత్వం చేయడం జరిగింది. అంతేకాక ఈ చిత్రానికి మంచి సంగీత నేపథ్యం ఉందని కూడా చెప్పుకోవచ్చు. పాటలు ఎంతో బాగా వచ్చాయి. అదేవిధంగా ఆ వాతావరణాన్ని అలాగే అడవులను, కొండలను బాలన్స్ చేస్తూ కలరింగ్ ఎక్కడ మిస్ కాకుండా చూసుకున్నారు. యదార్థ సంఘటన కావడంతో అక్కడక్కడ కొంచెం బోర్ అనిపించినప్పటికీ చిత్రం చివరికి వచ్చేప్పటికి ఎమోషనల్ గా ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యేలా దర్శకుడు జాగ్రత్త పడటం మరింత విశేషంగా చెప్పుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

  • రాకేష్ వర్రె నటన చిత్రానికి ఎంతో పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.
  • యదార్థ కథ కావడం.
  • విరించి వర్మ దర్శకత్వం.
  • నటీనటుల నటన.

మైనస్ పాయింట్స్:

  • గ్రాఫిక్స్.
  • అక్కడక్కడ బ్యాగ్రౌండ్ మ్యూజిక్.

సారాంశం:
యథార్థ సంఘటనలు ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని భావి తరాలకు జితేందర్ రెడ్డి వంటి వీరుల జీవిత ప్రయాణం ఒక స్ఫూర్తిగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రేక్షకులు ముందుకు ఈ చిత్రం రావడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులతో పాటు పిల్లలు, యువత అలాగే అన్ని వయసుల వాళ్ళు ఈ చిత్రం తప్పనిసరిగా చూసే విధంగా ఈ చిత్రం ఉంది.