రమేష్ చెప్పాల రచన దర్శకత్వంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన చిత్రం లగ్గం. సాయి రోనక్, ప్రగ్య నాగ్ర జంటగా నటిస్తూ నటకిరీటి రాజేంద్రప్రసాద్, రోహిణి కీలకపాత్రలో నటిస్తూ రఘుబాబు, సప్తగిరి, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శ్రీను, ఎల్బీ శ్రీరామ్, రచ్చ రవి, చిత్రం శ్రీను, కిరీటి తదితరులు నటించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ సినిమాకు నాగేశ్వర్ రెడ్డి బొంతల ఎడిటింగ్ వర్క్ చేశారు. అక్టోబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.
కథ:
రాజేంద్రప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తన మేనల్లుడుకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దామా అనుకుంటాడు. దాని గురించి తన చెల్లెలతో మాట్లాడతారు. అనుకున్నట్లుగానే వారికి పెళ్లి నిశ్చయమవుతుంది. అయితే లక్కం జరుగుతుందా లేదా? ఈ మధ్యలో తెలంగాణ సాంప్రదాయపద్ధంగా జరిగే ప్రతి విషయాన్ని పూర్తిగా చూపిస్తూ వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలను, ఎమోషన్ ని చూపిస్తూ ఈ సినిమా ఉండబోతుంది. కానీ అటు ఇంటర్వెల్ కి అలాగే క్లైమాక్స్‌లో ఏం జరుగుతుంది అనేది కచ్చితంగా స్క్రీన్‌పై చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.
నటీనటులు నటన:
ఈ చిత్రానికి ముఖ్యంగా రాజేంద్రప్రసాద్, రోహిణి ప్రారంభోత్సవం చెప్పుకోవాలి. తమ నటనతో అలాగే ఎమోషనల్ సీన్స్ లో ఎంతో బాగా నటించారు. అదేవిధంగా హీరో సాయి రోనక్, ప్రగ్య నాగ్ర జంటగా ఎంతో బాధ నటించారు. చిత్రంలో రఘుబాబు, సప్తగిరి, చమ్మక్ చంద్ర, ఎల్బి శ్రీరామ్, తదితరులు తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ సినిమాలకు మరింత బోనస్‌గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ:
ఈ చిత్రానికి దర్శకుడు తన సాంకేతికంగా ఎంతో బాగా సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పుకోవాలి. కథ, స్క్రీన్ ప్లేతోపాటు విచిత్రానికి సినిమాటోగ్రాఫర్ ఎంతో ప్లస్ అని చెప్పుకోవాలి. అటు సందర్భాన్ని బట్టి పాటలు ఎమోషనల్ గా ఉండటంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో గొప్పగా సంగీత దర్శకుడు మణిశర్మ అందించడం సినిమాకు మరింత ప్లస్‌గా మారింది.
ప్లస్ పాయింట్స్ :
కథ, సినిమాటోగ్రఫీ, సంగీతం, రాజేంద్ర ప్రసాద్,రోహిణి నటన
మైనస్ పాయింట్స్ :
అర్ధం కానీ కొన్ని తెలంగాణ పదాలు
సారాంశం :
థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన ఓ చక్కటి కుటుంబ ఎమోషనల్ కథ చిత్రం.