ల్యాండ్ వాగ్వాదంలో టాలీవుడ్ నిర్మాత బూరగపల్లి శివరామకృష్ణ అరెస్ట్

టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ రాయదుర్గంలోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించారు. నకిలీ పటాస్ సృష్టించి వేల కోట్ల విలువైన 84 దగ్గర ల్యాండ్ ను శివరామకృష్ణ కాజేసే ప్రయత్నంలో స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లోని సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సహాయంతో ఈ నకిలీ పత్రాలు సృష్టించడం జరిగింది. ఆ తర్వాత ఆ ల్యాండ్ ను తనదైన అంటూ క్లైమ్ చేశారు. దీనికి బిల్డర్ మారగొని లింగం గౌడ్ సహాయం చేయడంతో ఆ ల్యాండ్ లో పాగా వేయడం జరిగింది. ఆ నకిలీ పత్రాలపై 2003లో అప్పటి ప్రభుత్వం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేయడం జరిగింది. కాగా సుప్రీంకోర్టు శివరామకృష్ణ పత్రాలు నకిలీ అంటూ తేల్చి వేసింది. అలా సుప్రీంకోర్టు నకిలీ పత్రాలని తేల్చివేయడంతోపాటు శివరామకృష్ణతో పాటుగా మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగింది. శివరామకృష్ణ తో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్ ను ఓయూ పోలీసులు అరెస్టు చేసి పూర్తిస్థాయిలో చేస్తున్నారు.