నెగటివ్ రివ్యూస్ ని కూడా లెక్క చేయకుండా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తున్న సాహూ సినిమాపై లార్గో వించ్ చిత్ర దర్శకుడు జరోమి సల్లే కామెంట్స్ చేశాడు. సాహూ సినిమా 2008లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా ‘ లార్గో వించ్ ‘ కి కాపీ అంటూ ట్వీట్ చేసిన జరోమి సల్లే… లార్గో వించ్ సినిమాకి సాహో మూవీసెకండ్ ఫ్రీమేక్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. లార్గో వించ్ సినిమానే స్ఫూర్తిగా తీసుకోని వచ్చిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కన్నా సాహూ సినిమా మరింత చెత్తగా ఉందని అభివర్ణించారు. ఇది చాలదన్నట్లు ‘ తెలుగు దర్శకులారా! దయచేసి మీరు నా సినిమాలను దొంగిలిస్తే.. కనీసం వాటిని ప్రాపర్ గా అయినా దొంగిలించండని సల్లే సెటైర్ కూడా వేశాడు.
తన ఇండియన్ కెరీర్ ట్వీట్ చాలామందికి బాధ కలిగించొచ్చు కానీ తానేం చేయలేనని, బహుశా ఇండియాలో తనకి మంచి కెరీర్ ఉండొచ్చని భావిస్తున్నానన్నారు. జరోమి సల్లే ట్వీట్స్ చూసిన ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం నెగటివ్ కామెంట్స్ తో సల్లేపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ చెత్త లార్గో వించ్ సినిమా కారణంగానే మాకు ఇక్కడ రెండు సినిమాలు పోయాయని, ఆ కథ కారణంగానే సాహూ దాదాపు 150 కోట్లు నష్టపోయిందని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం లార్గో వించ్ కథ కొత్తదేమీ కాదని, అదే కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయని, లయన్ కింగ్ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ఎన్నో సినిమాలు ఇదే ప్లాట్ పాయింట్ తో తెరకెక్కాయని కౌంటర్ వేస్తున్నారు.