ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్ చిత్రం పుష్ప-2 దిరూల్. పుష్ప దిరైజ్ సాధించిన బ్లాకబస్టర్ విజయమే అందుకు కారణం. ఆ చిత్రంలోని ప్రతి అంశం సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పుష్ప-2 గురించి ప్రతి అంశం సన్సేషనే.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్ లాక్ చేశారు.. ఈ ఫస్ట్‌హాఫ్ అద్బుతంగా వుందని, ప్రేక్షకులు ఎంత ఊహించుకున్నా అంతకు తగ్గేదేలే లా వుందని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్‌ను జరుపుకుంటునే మరోవైపు నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, రెండు పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబరు 6న పుష్ప-2 క్రియేట్ చేయబోయే రిక్డార్డుల గురించి అందరి రెడీ కావాల్సిందే. అంతేకాదు ఈ చిత్రం రిలీజ్‌క ముందే 1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తిచేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
సిబ్బంది:
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్ బండ్రెడ్డి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
CEO: చెర్రీ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: మీరెస్లౌ కూబా బ్రజక్
ప్రొడక్షన్ డిజైనర్: ఎస్. రామకృష్ణ – మోనికా నిగోత్రే
గీత రచయిత: చంద్రబోస్
బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సహకారంతో
మార్కెటింగ్ హెడ్: శరత్ చంద్ర నాయుడు
పిఆర్‌ఓలు: ఏలూరు శ్రీను, మడూరి మధు
మార్కెటింగ్: ఫస్ట్ షో