దేవర పై సాయి దుర్గ తేజ్ ట్వీట్

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా జాన్వీ కపూర్ కథానాయకగా సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ మరెందరో నటీనటులు కీలకపాత్రలో నటిస్తూ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా దేవర. ఈ సినిమా ఎన్నో అంచనాలతో సుమారు ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఈ సినిమా టికెట్ రేట్లు పెంపుకై ప్రభుత్వాలు అనుమతించాయి. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాకు ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమ విషెస్ తెలిపారు. అదేవిధంగా మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఎన్టీఆర్ కు, కళ్యాణ్ రామ్ కు , కొరటాల శివ, అనిరుద్ లకు అలాగే ఈ చిత్ర టీంకు తన బెస్ట్ విషెస్ తెలుపుతూ తన X ద్వారా ట్వీట్ చేశారు. చివరిగా ఎన్నో రోజుల తర్వాత తాను లేచి చూస్తున్న దేవర సినిమా రాబోతుంది అంటూ సాయి దుర్గ తేజ్ పేర్కొన్నారు.