రద్దు అయిన ఎన్టీఆర్ ‘దేవర’ ప్రి రిలీజ్ ఈవెంట్

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో ఎన్టీఆర్, జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా అనిరుద్ సంగీతం అందిస్తూ ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా దేవర. ఈరోజు హైదరాబాదులో దేవర సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా చేయాలనే ఆలోచనతో నోవోటల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంచనాలు మించి అభిమానులు ఈ వేడుకకు హాజరు కావడంతో అటు ఈ ఈవెంట్ నిర్వహకులు అలాగే పోలీసులు అభిమానులను అదుపు చేయలేకపోయారు. అంతేకాక అదే సమయంలో అభిమానులు అత్యుత్సాహంతో నోవోటల్ హోటల్ ను పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. ఈ కారణాల వల్ల దేవర సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ రద్దయింది. అప్పటికే ఈవెంట్ కు హాజరు అయిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత సూర్యదేవుడు చిన్నబాబు, నాగ వంశీ తిరిగి వెళ్ళిపోయారు. అంతేకాకుండా దేవర సినిమా టీం కూడా ఇంటి దారి పట్టారు.