టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం అందరికీ తెలిసిందే. 16 ఏళ్ల వయసులో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ లేడీ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ లోనే ఒక పోలీస్ స్టేషన్లో ఇటీవలే కంప్లైంట్ చేయగా గోవా దగ్గరలో పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
కోర్టు జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించగా ఆ రిమాండ్ లో తప్పు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. 2019లో పరిచయం అయిన ఈ లేడీ కొరియోగ్రాఫర్ ను ఒక దురుద్దేశంతోనే అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు, 2020లో తనపై అత్యాచారం చేసినట్లు ఆయన రిమాండ్ సమయంలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికి ఆమెకు 16 ఏళ్ల వయసు కాగా ఆ తర్వాత కూడా నాలుగు సంవత్సరాలలో పలుమార్లు పాల్పడినట్లు, ఆ విషయం బయటకి వస్తే సినిమాల్లో అవకాశం రాకుండా చేస్తానని బెదిరించినట్లు, జానీ మాస్టర్ భార్య కూడా తను బెదిరించినట్లు రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.