ఎన్టీఆర్ కు పవన్ కళ్యాణ్ రిప్లై

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సినిమా దేవర. ఈ సినిమా ఈనెల 27న విడుదలకు సిద్ధంగా ఉండగా దీనికి సంబంధించి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త GO విడుదల చేయడం జరిగింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండటంతో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మీ సహకారం ఇండస్ట్రీకి ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు ఎన్టీఆర్ X వేదికగా తెలపడం జరిగింది.

అయితే దీనికి సమాధానం గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ ఎన్టీఆర్ దేవర సినిమాకు బెస్ట్ విషెస్ తెలిపారు. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి ఎన్డీఏ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ తోడుగని నిలుస్తుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.