తిరుమల లడ్డు ప్రసాద వివాదంపై స్పందించిన నటుడు డాక్టర్ మోహన్ బాబు

సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు గారు తిరుమల తిరుపతి లడ్డు వివాదంపై స్పందించారు. తన X వేదికగా ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ ప్రశ్నలడి ద్వారా అయినా ఇలా తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.

నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం.

ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటూ… ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.