గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి లడ్డు వివాదం అందరికీ తెలిసిందే. దేవస్థాన ప్రసాదం అయినటువంటి లడ్డులో మాంసాహారంతో కూడిన పదార్థాలే కాకుండా చేప నూనె అలాగే నాణ్యతలేని నెయ్యి ఉపయోగించినట్లు కొన్ని టెస్టులలో ఆ విషయం బయటపడినట్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇదంతా గత ప్రభుత్వం హయాంలో జరిగినట్లు తెలిపింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సనాతన ధర్మాన్ని అలాగే ఆచారాలను కాపాడుకునే విధంగా ఒక బోర్డ్ జాతీయ స్థాయిలో నిర్మించాలి అంటూ ఆయన తెలిపారు. అదే విషయాన్ని తన సోషల్ మీడియా మాధ్యమం Xలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సమానంగా సినీ నటుడు ప్రకాష్ రాజు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు… మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలా జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి దోషులు ఎవరో కనుక్కొని వారిని శిక్షించే విధంగా ఉండాలి కానీ ఎందుకు ఆందోళన వ్యాపింప చేస్తున్నారు? జాతీయ స్థాయిలో ఎందుకు ఈ సమస్య గురించి వదల కొడుతున్నారు? ఇప్పటికే దేశంలో మనకి తగినంత మతపరమైన వదృక్తులు ఉన్నాయి. అంతేకాక కేంద్రంలో మీకు స్నేహితులు ఉన్నారు. వారికి నా ధన్యవాదాలు అని జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాస్ ట్యాగ్ తో ప్రకాష్ రాజు Xలో తన అభిప్రాయం తెలిపారు.
దీనికి సమాధానం ఇస్తూ సినీ నటుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మంచు విష్ణు ఇలా అన్నారు… ప్రకాష్ రాజు గారు, తిరుమలలో లడ్డు అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు కోట్ల మంది హిందువులకు సంబంధించిన నమ్మకం, భక్తి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ తోనే మన సాంప్రదాయాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో ఆయన కల్పించి చెప్పింది ఏమీ లేదు. మీరు దయచేసి మౌనంగా ఉంటే మంచిది అంటూ స్టే ఇన్ యువర్ లేన్ ఆన్ హష్ ట్యాగ్ తో మంచి విష్ణు ప్రకాష్ రాజ్ కు సమాధానం ఇచ్చారు.
అయితే వీరిద్దరూ గతంలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికలకు పోటీ పడిన విషయం అందరికీ తెలిసిందే.