మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం

అక్కినేని నాగేశ్వరావు గారి 100వ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాదులో అక్కినేని కుటుంబం అలాగే శ్రేయోభిలాషులు అంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో అక్కినేని నాగేశ్వరావు గారు నటించిన సినిమాల గురించి మాత్రమే కాకుండా, ఆయన చేసిన సేవ కార్యక్రమాలు ఇంకా ఆయన సాధించిన విజయాల గురించి అందరూ మాట్లాడారు. అదే సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ వారు ప్రతి సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డ్స్ ఇస్తూ ఉండే సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ సంవత్సరం అక్కినేని నాగేశ్వరావు గారి 100వ జయంతి సందర్భంగా ఈ ఏడాది ఇచ్చే ఏఎన్ఆర్ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదే విషయాన్ని చిరంజీవి గారికి చెప్పగా ఆయన ఎంతో ఆనందించాలని నాగార్జున అన్నారు. ఈ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్టోబర్ 28వ తేదీన అందజేస్తున్నట్లు అక్కినేని నాగార్జున తెలిపారు.