లేడి కొరియోగ్రాఫర్పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ను పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్ గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
జానీ మాస్టర్ పై ఓ లేడి కొరియోగ్రాఫర్ లైంగిక వేదింపులు చేసారంటూ పోలీసు స్టేషన్లో కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసినదే. దీనికి ప్రతిచర్యగా పొఖ్సో చట్టం ద్వారా పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. అయితే గోవా లో జానీ మాస్టర్ ను అరెస్టు చేయగా ఈరోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది.