‘హైడ్ & సీక్’ సినిమా రివ్యూ

బసిరెడ్డి రానా దర్శకత్వంలో నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మాణంలో విశ్వనాధ్ దుద్దూంపూడి కథానాయకుడిగా శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ కథానాయికలుగా తేజ సోనీ నాయుడు, వైవా రాఘవ, సుమంత్ వేరెళ్ళ, రోహిత్ అద్దంకి, సాయినాథ్ గడిమెల్ల తదితరులు కీలకపాత్ర లో నటిస్తూ సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం హైడ్ అండ్ సీక్. ఈ చిత్రానకు లిజోకే జోష్ సంగీతం అందించగా కామారెడ్డి కుడుముల ఎడిటింగ్ పనులు చేశారు.

కథ :

ఈ సినిమాలో హీరో లక్ష్యం మిలిటరీ డాక్టర్ కావడం. తన తండ్రి ఇంకా బావ మిలిటరీలోనే పనిచేస్తూ విరమణ పొందగా తనకి కూడా మిలటరీ పని చేయాలనుకున్న మిలిటరీ డాక్టర్ కావడం కోసం తన అక్కతో కర్నూల్ లో కలిసి ఉంటూ చదువుకుంటాడు. అయితే ఇది వాళ్ళ అక్కకి ఇష్టం లేదు. అప్పటికే హీరో హీరోయిన్తో తన కాలేజీలో ప్రేమలో ఉంటాడు. వారిద్దరి ప్రేమ హీరోయిన్ తండ్రికి కూడా ఇష్టం కావడంతో పెళ్లికి ఒప్పుకుంటారు. హీరోయిన్ తండ్రి ఒక మెంటల్ హాస్పిటల్ ఉంది. అయితే అదే సమయంలో ఒక డెలివరీ పోయింది కారణం లేకుండా ఒక వ్యక్తి చంపేస్తాడు. ఈ కేసును యాక్సిడెంట్ అనుకోని పోలీసులు క్లోజ్ చేస్తారు. కొద్దిరోజుల తర్వాత హీరో ఫ్రెండ్ కూడా మరణిస్తాడు. అయితే అది సూసైడని అందరూ అనుకోగా హీరో మాత్రం కాదు హత్య బలంగా నమ్ముతాడు. అదే విషయాన్ని పోలీసులకు ఉత్తరం ద్వారా తెలుపుతాడు. ఆ తరువాత ఆ కేసు హీరోకి ఎలా చెట్టుకుంది? అలా జరిగేలా చేసింది ఎవరు? దీని వెనక ఎటువంటి నేపథ్యం ఉంది? చివరికి ఏం జరుగుతుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ:

సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. కొంతమంది క్యారెక్టర్ లను గ్రేగా చూపించినప్పటికీ వారు తమ ఇచ్చిన పాత్రలో జీవించారు. అలాగే హీరో ఇంకా ఇతర నటీనటులు కూడా మంచి పర్ఫామెన్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

సాంకేతిక విశ్లేషణ:

సినిమా బాగానే ఉన్నప్పటికీ కొంచెం నిర్మాణ విలువలు అలాగే దర్శక నైపుణ్యం తగ్గిందని చెప్పుకోవాలి. సినిమాలో కొన్ని అవసరంలేని సంఘటనలు అలాగే కొంత స్క్రీన్ ప్లే లో అసంతృప్తి కలుగుతుంది. సినిమాకు సంగీతం అలాగే కలర్ గ్రీటింగ్ చాలా బాగా వచ్చాయి. అయితే దర్శక నిర్మాతలు ఇంకా కాస్త ఏకాగ్రతతో పని చేస్తే సినిమా ఇంకా బాగుండేలా వస్తుంది అనిపించింది.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, కథ, మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నిర్మాణ విలువలు

ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికే ఇటువంటి కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ మరొక కొత్త ప్రయత్నం అని చెప్పుకోవచ్చు.