‘బిగ్ బాస్’ ఫేమ్, హీరో సోహైల్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. సోహైల్ తల్లి ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సోహైల్ కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయనకు తండ్రి సయ్యద్ సలీం, తల్లి, తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు. సోహైల్ తల్లి ఫైమాసుల్తానా గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
డయాలసిస్ నిమిత్తం మెడికవర్ హాస్పిటల్ లో జాయిన్ అయిన ఆమె పరిస్థితి విషమించడంతో కన్ను మూసినట్లుగా తెలుస్తోంది. దీంతో సోహైల్ శోకసంద్రంలో మునిగిపోయాడు. సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని స్వస్థలం కరీంనగర్ తరలిస్తున్నారు.
‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సోహైల్ ‘బిగ్ బాస్-4’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
‘లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు’ వంటి వరుస సినిమాలతో హీరోగానూ గుర్తింపు లభించింది.*