#లైఫ్ స్టోరీస్ జెన్యూన్ రివ్యూ

అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో వస్తున్న సినిమా #లైఫ్ స్టోరీస్. జీవితంలోని చిన్న, రోజువారీ క్షణాల్ని మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరణతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీసిన ఒక సంకలన చిత్రం. సెప్టెంబరు 14న విడుదలైంది ఈ చిత్రం. ప్రేమ, స్థితిస్థాపకత మరియు అనుబంధం యొక్క చిన్న చిన్న విషయాలను ప్రతిబింబించే వివిధ వయసుల వ్యక్తుల నుండి విభిన్న కథలను తీసుకుని తీసిన సినిమా. సాంప్రదాయక కథనాలలా కాకుండా, #లైఫ్ స్టోరీస్ సింప్లిసిటీగా ఉండే సాధారణ విషయాలలో అందాన్ని కనుగొంటుంది, సాధారణ సంఘటనలు మన జీవితాలపై ఎలా తీవ్ర ప్రభావం చూపగలవో చూపిస్తుంది. యానిమేటర్ నుంచి లైవ్-యాక్షన్ ఫిల్మ్ మేకింగ్‌లో తన నైపుణ్యాన్ని చూపిస్తూ ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దృశ్యమాన కథనాన్ని భావోద్వేగ లోతుతో మిళితం చేసింది. జీవితంలోని నిశ్శబ్దమైన ఇంకా ముఖ్యమైన అంశాలపై దాని ప్రత్యేక దృష్టితో, #లైఫ్ స్టోరీస్ అన్ని వయసుల ప్రేక్షకుల జీవితాలకు దగ్గరగా తీసిన చిత్రం. 

కథ : 11 ముఖ్య పాత్రలతో 6 వివిధ కథల తో ఒక మంచి జీవిత కథగా సినిమాను మన ముందుకు తీసుకొచ్చారు. ప్రతి కథకి ఒక ప్రాముఖ్యత ఉండేలాగా జీవితానికి చాలా దగ్గరగా తీసిన సినిమా ఇది. వర్చువల్ క్యాండిల్ లైట్ డిన్నర్, లాంగ్ డ్రైవ్ విత్ లవింగ్ పర్సన్, గ్లాస్ మేట్స్ ఇలా ఒక్కొక్క కథకి ఒక్కో ప్రాముఖ్యతనిస్తూ తీశారు. ఈ ఆరు కథలని చివరకు కలిపిన తీరు చాలా బాగుంది.

నటీనటుల నటన : హీరో హీరోయిన్ అని కాకుండా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా నాచురల్ గా నటించారు. ఎవరి పాత్రకు వారు తగిన న్యాయం చేశారు. సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ, ఎం. వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి ఇలా అందరూ తమ పాత్రలో జీవించారు.

సాంకేతిక విశ్లేషణ : అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థలపై ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు. దర్శకుడు ఉజ్వల్ కశ్య ప్ ఎంచుకున్న కథ స్క్రీన్ ప్లే పనితీరు చాలా బాగున్నాయి. విన్ను అందించడం మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్.

ప్లస్ పాయింట్స్ : నటీనటుల నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డిఓపి పనితీరు, ఎడిటింగ్.

మైనస్ పాయింట్స్ : క్లైమాక్స్, సాంగ్స్.

వయసుతో సంబంధం లేకుండా అందరు తమ కుటుంబ సభ్యులతో చూడదగ్గ సినిమా #లైఫ్ స్టోరీస్