ప్రభాస్ తో కలిసి నాలుగు రోజులు… : రకుల్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ తో ఆమె నటించినట్లు అన్నారు. తన కెరియర్ మొదట్లో ప్రభాస్ తో కలిసి ఆమెకు నటించే అవకాశం వచ్చిందని, నాలుగు రోజులపాటు షూటింగ్ కూడా జరిగిందని చెప్పారు. ఆ తర్వాత తనకు కూడా చెప్పకుండా మరొకరి రీప్లేస్ చేస్తూ ఆ సినిమాను చేశానని ఆమె తెలిపారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తనను ఆ సినిమా నుండి తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు. అదొక్కటే కాదు, అదేవిధంగా మరొక తెలుగు ప్రాజెక్టులో కూడా అలాగే జరిగిందని ఆమె అన్నారు. అయితే అది ఏ సినిమా అనేది మాత్రం ఆమె చెప్పలేదు.