నందమూరి నరసింహ బాలకృష్ణ గారు ఇటీవలె ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారికి అల్లు ఫ్యామిలీతో అలాగే మెగా ఫ్యామిలీతో వివాదాలు ఉన్నాయి అని బయట ప్రేక్షకులు అనుకుంటున్నారు. వాటిపై మీరు ఏమంటారు అని అడగగా దానికి బాలకృష్ణ గారు అటువంటివి ఏమీ లేవు అన్నారు. నాకు నా పిల్లలు ఎలాగో రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా అలాగే. వారు ఎదుగుతుంటే సంతోషపడేవారిలో నేను ముందుంటాను. మేము ఎవరి షూటింగ్ పనులలో వారు బిజీగా ఉన్నప్పటికీ ఎటువంటి ఒకేషన్ లో అయినా కలిసినప్పుడు కచ్చితంగా కలిసిమెలిసి ఉంటాము. ఇటీవల పుష్ప 2 సినిమా షూటింగ్ సెట్టుకు వెళ్లడం జరిగింది. అక్కడ కూడా అల్లు అర్జున్ నన్ను సార్ అని సంబోధించినప్పుడు నేను వెంటనే సార్ కాదు బ్రో అని పిలవమన్నాను. ఇంతలో సుకుమార్ నా దగ్గరికి రాగా నేను అప్పటికే సుకుమార్ కోసం తీసుకువెళ్లిన కత్తిని సుకుమార్ కు చూపించి నాతో 3 నెలల్లో సినిమా తీస్తాను అని నాకు ఆన్ స్టాప్పబుల్ లో మాట ఇచ్చావు. మరి ఇంకెప్పుడు ఆ సినిమా తీస్తావు అని అడగడం జరిగింది. ఇలా నేను తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండే ప్రతి ఒక్కరితో చాలా సరదాగా కలిసి మెలిసి ఉంటాను అని ఆయన అన్నారు. నా సినిమాలు వల్ల నేను కోపద మనిషిని అనుకుంటారేమో కానీ నేను అందరితో చాలా కలయికగా ఉంటాను అని బాలకృష్ణ గారు సమాధానం ఇచ్చారు.