నటుడు రవితేజకు కుడి చేతికి గాయం అయిన సంగతి అందరికి తెలిసినదే. తన 75వ సినిమా షూటింగ్ చేస్తుండగా ఆయన కుడి చేతికి గాయం కావడం జరిగింది. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో రెండు రోజుల క్రితం ఆయన కుడి చేతికి డాక్టర్లు సర్జర్ చేసి 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయితే ఈరోజు ఉదయం రవితేజ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావడం జరిగింది. డిశ్చార్జ్ అయిన రవితేజ తన సోషల్ మీడియా అయిన X ద్వారా తాను ఆరోగ్యంగా అన్నట్లు, ఈరోజే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. అందరి ప్రార్థనల వలన తాను క్షేమంగా ఉన్నానని, ఆరోగ్యం కుదుట పడిన వెంటనే షూటింగ్ కు రావడానికి వేచి చూస్తున్న అని రవితేజ తెలిపారు.