హనుమాన్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మాత బాలు చరణ్ కన్నడ లో బ్లాక్ బస్టర్ అయినా శాకాహారి చిత్ర తెలుగు అనువాద హక్కులను మంచి రేట్ కి సంపాదించుకున్నారు. తెలుగు నేటివిటీ కి దగ్గర గా ఉండాలి అని దుబ్బింగ్ మీద మంచి శ్రద్ధ పెట్టారు. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు అయ్యిన గొప్పరాజు రమణ గారి చేత హీరో క్యారెక్టర్ కి దుబ్బింగ్ చేపించారు. ఇప్పుడు ఈ శాకాహారి చిత్రం ఆచం మన తెలుగు సినిమా లా ఉంటుంది. గొప్పరాజు రమణ గారి డబ్బింగ్ వెర్షన్ కేవలం ఆహా ఓ టి టి మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.
సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో రంగాయన రఘు ప్రధాన పాత్ర పోచించారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ. గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే .. హరిణి శ్రీకాంత్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మయూరి అంబేకల్లు అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించింది.
మంచి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఆదరించే వారికీ ఈ శాకాహారి చిత్రం మంచి విందు భోజనం అవుతుంది. సినిమా మొదలు నుంచి చివరి వరకు మంచి సస్పెన్స్ అంశాలతో చిత్రీకరించారు దర్శకులు. ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. హనుమాన్ ప్రొడక్షన్స్ నిర్మాత బాలు చరణ్ మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. తెలుగు ప్రేక్షకులకి మంచి చిత్రాలు అందిస్తున్నారు. వారి బ్యానర్ లో అందించిన ఎన్నో గొప్ప సినిమాలో ఈ శాకాహారి చిత్రం ఒకటి. ఆగష్టు 24 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.