బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమాంటీ కాలనీ 2” ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పంపిణీ చేస్తోంది. ఈ సినిమాను శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించారు. ఈ రోజు హైదరాబాద్ లో “డీమాంటీ కాలనీ 2” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అజయ్ భూపతి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
నిర్మాత బి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ – నాకు “డీమాంటీ కాలనీ” సినిమా బాగా నచ్చింది. “డీమాంటీ కాలనీ 2” అనౌన్స్ అయినప్పటి నుంచి డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు గారితో ట్రావెల్ అవుతున్నాను. వీఎఫ్ఎక్స్ వల్ల మూవీ రిలీజ్ కొంత డిలే అయ్యింది. తమిళంలో బిగ్ హిట్ అయ్యిందీ సినిమా. తెలుగులోనూ అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. ఇందులో హారర్ కంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అజయ్ ఆర్ జ్ఞానముత్తు గారు టెక్నికల్ గా స్ట్రాంగ్ డైరెక్టర్. ఆయన చేసిన అంజలి ఐపీఎస్, కోబ్రా, డీమాంటీ కాలనీ సినిమాలు చాలా బాగుంటాయి. ఆయన టాలెంట్ మీద నమ్మకంతో ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – నిర్మాత సురేష్ రెడ్డి నాకు మిత్రుడు. ఆయన “డీమాంటీ కాలనీ 2” సినిమా తీసుకుంటున్నానని చెప్పినప్పుడు మంచి సినిమా చేయండి అని చెప్పాను. ఒక మంచి టీమ్ వర్క్ తో దర్శకుడు అజయ్ గారు ఈ సినిమా రూపొందించారు. థియేటర్స్ కు వెళ్లి చూడాలని అనిపించే చిత్రమిది. తమిళంలో పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి మాట్లాడుతూ – “డీమాంటీ కాలనీ 2” సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ మాకు ఇచ్చిన నిర్మాత సురేష్ రెడ్డి గారికి, డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు గారికి థ్యాంక్స్. ఈ నెల 15న తమిళంలో ఈ సినిమా విడుదలైంది. అక్కడ ఘన విజయాన్ని సాధించింది. మేము విమల్ థియేటర్ లో నిన్న సినిమా చూశాం. ఫోన్స్ కూడా పక్కన పెట్టి చూసేంత ఇంట్రెస్టింగ్ గా సినిమా ఉంది. తప్పకుండా తెలుగులోనూ “డీమాంటీ కాలనీ 2” సక్సెస్ అందుకుంటుంది. అన్నారు.
హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ మాట్లాడుతూ – “డీమాంటీ కాలనీ 2” మూవీకి తెలుగు ప్రొడ్యూసర్స్ నుంచి వస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. మా సినిమా స్పెషల్ ప్రీమియర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ దగ్గర నుంచి వచ్చిన ఆదరణ సంతోషాన్నిస్తోంది. తమిళంలో మా మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో కూడా అలాంటి విజయాన్నే అందిస్తారని కోరుకుంటున్నాం. మీరు ఈ నెల 23న “డీమాంటీ కాలనీ 2” సినిమాను థియేటర్స్ కు వెళ్లి చూస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు మాట్లాడుతూ – “డీమాంటీ కాలనీ 2” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మీడియా మిత్రులకు, దర్శకులు ఆర్జీవీ, అజయ్ భూపతి గారికి మిగతా గెస్టులకు థ్యాంక్స్. ఈ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాను. ఈ సినిమాను 2023 జనవరిలోనే కంప్లీట్ చేశాం. సినిమా ఫస్ట్ కాపీ చేతిలోకి వచ్చాకే బిజినెస్ డీల్స్ చేయాలని అనుకున్నాం. షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాం. మా సినిమా కొనేందుకు ఫస్ట్ తెలుగు నుంచి అప్రోచ్ అయిన ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారు. ఆయన మా మూవీలోని ఒక్క సీన్ కూడా చూడకుండా సినిమా మీద నమ్మకంతో మూవీ తెలుగు రైట్స్ తీసుకున్నారు. “డీమాంటీ కాలనీ 2″కు మేము క్లోజ్ చేసిన ఫస్ట్ బిజినెస్ కూడా తెలుగు నుంచే. “డీమాంటీ కాలనీ 2” తమిళంలో మంచి హిట్ అయ్యింది. తెలుగు ఆడియెన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఈ మూవీకి 3, 4 పార్ట్స్ కూడా చేయబోతున్నాం. సెకండ్ పార్ట్ లోని ఆర్టిస్టులంతా థర్డ్ పార్ట్ లో కంటిన్యూ అవుతారు. ఇప్పటిదాకా ఏ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ చూపించలేదు. మేము ఈ మూవీలో టిబెటియన్ యాక్టర్ ను పెట్టి ఆ ప్రయత్నం చేశాం. అన్నారు.
డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ – నేను దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో “డీమాంటీ కాలనీ 1” రిలీజైంది. ఆ సినిమాను ల్యాప్ టాప్ లో ఎన్నోసార్లు చూసి థ్రిల్ అయ్యాను. సగం సినిమా ఒక గదిలోనే జరుగుతుంది కానీ మనల్ని డైరెక్టర్ ఎంగేజ్ చేయగలిగాడు. “డీమాంటీ కాలనీ 2” సినిమాను తీసుకుంటున్నా అని నా మిత్రుడు సురేష్ రెడ్డి చెప్పినప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా తీసుకోమని సజెస్ట్ చేశాను. సేమ్ డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా బాగా చేస్తాడని చెప్పాను. నిన్న “డీమాంటీ కాలనీ 2” ప్రీమియర్ చూసినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యాం. ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు, సస్పెన్స్, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. “డీమాంటీ కాలనీ 1” కంటే “డీమాంటీ కాలనీ 2” పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నా. అన్నారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – నేను ఇరవై ఏళ్ల క్రితం భూత్ అనే సినిమాను చేశాను. అది అపార్ట్ మెంట్ లో జరుగుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అపార్ట్ మెంట్స్ లోకి వెళ్లేందుకు కొంతకాలం భయపడి చాలామంది వెళ్లలేదు. డీమాంటీ కాలనీ రిలీజ్ అయ్యాక ఆ కాలనీ పేరు పెట్టినందుకు కాంట్రవర్సీ జరిగిందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నాతో చెప్పారు. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ ఫుల్ ఫిల్మ్. ఇప్పుడు మరో భాషలోకి వస్తోంది అంతే. నిర్మాత సురేష్ రెడ్డి మంచి మూవీస్ తీసుకుంటాడనే నమ్మకం ఉంది. నేను ఈ మూవీ ప్రీమియర్ చూడలేదు. కానీ తమిళ్ నుంచి ఇక్కడ ప్రీమియర్ చూసిన వాళ్ల దగ్గర నుంచి మంచి టాక్ వచ్చింది. ఇవాళ కంటెంట్ ను బట్టి చిన్న సినిమాలు పెద్దవి అవుతున్నాయి. పెద్దవి చిన్నవి అవుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాల చూసే ట్రెండ్ నడుస్తోంది. అలా తెలుగులోనూ “డీమాంటీ కాలనీ 2” ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్
టెక్నికల్ టీమ్
మ్యూజిక్ – సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ – హరీశ్ కన్నన్
ఎడిటర్ – కుమరేష్.డి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
సమర్పణ – ఎన్ శ్రీనివాస రెడ్డి
ప్రొడ్యూసర్స్ – బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి
రచన దర్శకత్వం – అజయ్ ఆర్ జ్ఞానముత్తు