మలయాళ నటుడు మోహన్ లాల్ అస్వస్థకు గురయ్యారు. జనతా గ్యారేజ్, మన్యంపులి తదితర సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన మోహన్ లాల్ తీవ్ర జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. శ్వాస తీసుకోవడం ఇబ్బంది కారణంగా ఆయనను డాక్టర్లు చెక్ చేశారు. దానితో శ్వాస కోసం ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయనను ఐదు రోజులపాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించడం జరిగింది.