కాసులు కురిపిస్తున్న ‘మురారి’

సౌత్ లో రీ రిలీజ్ ల సందడి ఫ్యాన్స్ కి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ ఒక్కడు తో మొదలైన రీ రిలీజు ల జోరు కొనసాగుతోంది. గతంలో మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి, బిజినెస్ మాన్ అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ సునామి సృష్టించింది.

ఇప్పుడు మళ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజైన మురారి మహేష్ బాబు గారి రీ రిలీజ్ కలెక్షన్స్ మూడు రోజులకు గాను 8.21 కోట్లు కలెక్షన్స్ రాబట్టి మొదటి స్థానంలో ఉంది.

కానీ తెలుగు రీ రిలీజ్ సినిమాలలో ఖుషి ఒక్కరోజే ప్రదర్శింపబడి 7.46 కోట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది. సౌత్ లో రీ రిలీజుల సినిమాలలో దళపతి విజయ్ నటించిన గిల్లి సినిమా 32.50 కోట్లతో సౌత్ రీ రిలీజ్ లలో మొదటి స్థానంలో ఉంది.