చిదంబర ఆలయంలో నృత్య ప్రదర్శన – నాట్య మయూరి బిరుదు అందుకున్న ఇంద్రాణి దావులూరి

అందం, అభినయం, క్లాసికల్ డాన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అద్భుత సౌందర్యవతి ఇంద్రాణి దావులూరి. తన అద్భుతమైన నృత్య ప్రదర్శనను భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిదంబరం ఆలయంలో ఇచ్చారు. సాక్షాత్తు నటరాజు జన్మస్థానమైన చిదంబరం ఆలయంలో ప్రదర్శన ఇవ్వడానికి ఆలయ కమిటీ ఆహ్వానించిందని ఈ మేరకు ఇంద్రాణి దావులూరి ఆనందం వ్యక్తం చేశారు. ఆలయంలో డాన్స్ చేయడం తన పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు.

అనేక వాయిద్యాలు ధ్వనుల నడుమ దాదాపు 80 నిమిషాల పాటు ఏక ధాటిగా అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసి అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సంస్థ ఇంద్రాణి దావులూరికి నాట్య మయూరి బిరుదును ప్రధానం చేశారు. దీని పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఆలయ పెద్దలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇంద్రాణి దావులూరి ఉన్నత విద్యను అభ్యసించారు. మైక్రో బయాలజీ, పెర్ఫార్మింగ్ ఆఫ్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చేశారు. అలాగే తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాలలో వెండితెరపై మెరిశారు. కేవలం క్లాసికల్ డాన్స్ మాత్రమే కాదు అనేక టెలివిజన్ యాడ్స్ లలో నటించారు. మంజల్ సోప్, చమ్మనూర్ జ్యువెలర్స్, చుంగత్ జ్యువెలర్స్, సింగ్ మెహందీ, క్షేత్ర వంటి అనేక రకాల ప్రకటనలో నటించారు.
వీటితోపాటు మలయాళ మనోరమ వంటి యోగ వీడియోలు, మాఫియా, యువర్స్ మేఘన వంటి ఇంగ్లీష్ షార్ట్ ఫిలిమ్స్ లలో యాక్ట్ చేశారు ఇంద్రాణి దావులూరి.

ఇంద్రాణి దావులూరి ఇలాగే తన అభినయం, నృత్యం, నటనతో మరింత ముందుకు సాగుతూ.. అన్ని భాషా చిత్రాలలో వెండితెరపై మరిన్ని విజయాలను అధిరోహించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.