కుండపోత వర్షాలు కారణంగా కుండ చర్యలు విరిగి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అధిక వర్షాల వల్ల వరదలు రావడం జరిగింది. అలా వరదలు రాగా వాయనాడ్ ప్రాంత ప్రజలు అంతా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అంతేకాకుండా ఆస్తి నష్టంతో పాటు ఎంతో ఎంతో ప్రాణ నష్టం జరిగింది. గతంలో కూడా ఇటువంటి కుండ వర్షాల కారణంగా కేరళలో అలాగే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు రావడం మనం చూసాం. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2018లో ఒకసారి ఇలాగే ఎంతో నష్టం వాటిల్లింది. ఆ దుర్ఘటనపై 2018 అనే సినిమా కూడా రావడం మనం చూసాం. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరోసారి కేరళ వాయనాడ్ లో మరోసారి ఎటువంటి ప్రకృతి వైపరీత్యం చూస్తున్నాము. అయితే ఇప్పటికే మలయాళ నటుడు మోహన్ లాల్ కానీ స్వయంగా సాయం చేయడానికి కోసం వాయనాడ్ ప్రాంతానికి వెళ్లారు. దీనికై కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు నట్టు మోహన్ 3 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నటుడు సూర్య జ్యోతి దంపతులు 50 లక్షలు ఇవ్వగా మమ్ముట్టి దుల్కర్ తండ్రి కొడుకులు కలిసి 40 లక్షల ఇవ్వడం జరిగింది. అలాగే కమలహాసన్ 25 లక్షలు, ఫహాద్ ఫాజిల్ 25 లక్షలు, చియాన్ విక్రమ్ 20 లక్షలు అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న 10 లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇలా భాష ప్రాంతీయ భేదం లేకుండా మనదేశంలో ఇటువంటి ఆపద వచ్చిన ప్రతిసారి సినీ నటులే కాకుండా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వారంతా ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే రావడం అందరికీ గర్వకారణం.