బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టీజర్ విడుదల

రియాల్టీ షోస్ అనగానే తెలుగు ప్రజలకు సాధారణంగా గుర్తొచ్చేది బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులు ఎంతగా అంగీకరించారు అంటే ఇప్పటికే తెలుగులో 7 సీజన్లు పూర్తి చేయడం జరిగింది. అటు మా టీవీ ద్వారా బుల్లితెరపై స్క్రీన్ కావడమే కాక ఓటిటిలో కూడా ఈ షో స్ట్రీమ్ కావడం జరిగింది. ఈ షోను ఎక్కువగా అక్కినేని నాగార్జున గారు హోస్ట్ చేసినప్పటికీ ఒక షోను మాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్, ఒక షోను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇటీవలే ఈ రియాలిటీ షోకు సంబంధించి సీజన్ 8 లోగో విడుదల చేయడం జరిగింది. ఆ లోగో ప్రేక్షకులలో మంచి బజ్ తెప్పించగా ఇప్పుడు విడుదలైన టీజర్ కూడా అంతే బజ్ వచ్చేలా చేసింది.

ఇక టీజర్ విషయానికి వస్తే హాస్యనటుడు సత్య ఒక దొంగతనానికి వెళ్లి తన భార్యతో అక్కడ ఏం ఏం వస్తువులు ఉన్నయో తన భార్యతో ఫోన్ లో చెప్తుండగా ఒక అల్లాద్దీన్ దీపం నుండి నాగార్జున ప్రత్యక్షం అయ్యి సత్యను నచ్చిన కోరిక కోరుకోమంటారు. ఏం అడిగినా ఇస్తారా అని సత్య అడగగా ఈసారి లిమిట్ లేకుండా ఇస్తాను అని నాగార్జున సమాధానం ఇస్తారు.