‘వేద’ అనే అమ్మాయి జీవితాన్ని తెలియజేసే చిత్రమే ఇది. న్యాయం కోసం ఆమె చేసే పోరాటాన్ని చూపించే సినిమా ఇది. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పే ధృఢమైన మనస్తత్వాన్ని, ఎదురు తిరిగి పోరాడే తత్వాన్ని ఈ కథ ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో వేదకు తోడుగా, రక్షణ కవచంగా ఓ మాజీ సైనికుడు నిలబడ్డాడు. అతని అండతో ఆమె ఎంత వరకు పోరాడిందో తెలియజెప్పే కథాంశమే ఈ మూవీ.
‘వేద’ ట్రైలర్ చూస్తుంటే రొమాలు నిక్కబొడిచేంత యాక్షన్ సన్నివేశాలున్నాయని అర్థమవుతుంది. సినిమాలో హై యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. న్యాయం కోసం ప్రమాదకరమైన మార్గంలోకి వేద అనే అమ్మాయి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆమెకు ఎదురయ్యే సవాళ్లను సినిమా మనకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది.
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం పేరు వినగానే మనకు ఆయన పోషించిన అద్భుతమైన యాక్షన్ పాత్రలు గుర్తుకు వస్తాయి. ఈ చిత్రంతో మరోసారి ఆయన తనదైన పంథాలో మెప్పించారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ‘‘వేద’ లాంటి సినిమాలో భాగం కావటం నాకెంతో ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. మంచి వైపు నిలబడాలని, పోరాటం చేయాలనే అందరినీ ప్రేరేపించే కథాంశంతో సినిమా తెరకెక్కింది ’ అన్నారు జాన్ అబ్రహం.
చిత్ర దర్శకుడు నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే కేవలం వినోదాన్ని అందించే మాధ్యమం మాత్రమే కాదు. మంచి సందేశాన్ని కూడా అందిస్తుందని నేను నమ్ముతాను. రేపు వేద సినిమా చూసిన తర్వాత చాలా మంచి ప్రేక్షకులకు మనసుల్లో గుర్తుండిపోతుందని గట్టిగా విశ్వస్తున్నాను’’ అన్నారు.
ఉమేష్ కె.ఆర్.బన్సాల్, సీబీఓ, జీస్టూడియోస్ మాట్లాడుతూ ‘‘వేద’ అనేది బలమైన పాత్రలతో కూడిన శక్తివంతమైన కథ. ప్రేక్షకుల మనసులకు హత్తుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు.
ఎమ్మాయ్ ఎంటర్టైన్మెంట్ మధు బోజ్వానీ మాట్లాడుతూ ‘‘‘వేద’వంటి సినిమాను ప్రేక్షకులకు అందించటం మా అందరికీ ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. సాధికారితతను తెలియజేస్తూ స్ఫూర్తినింపేలా ఈ చిత్రాన్ని చేయటం అనేది సినిమాపై మాకున్న ప్రేమను తెలియజేస్తుంది. దీన్ని ఆగస్ట్ 15న విడుదల చేస్తుండటం మాకెంతో గర్వ కారణంగా అనిపిస్తోంది’’ అన్నారు.
జాన్ అబ్రహం, శర్వారి ప్రధాన పాత్రల్లో నటించిన ‘వేద’ చిత్రంలో అభిషేక్ బెనర్జీ కీలక పాత్రను పోషించారు. తమన్నా భాటియా స్పెషల్ అప్పియరెన్స్‌లో అలరించబోతున్నారు. అసీమ్ అరోరా రైటర్‌గా వర్క్ చేసిన ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ తెరకెక్కించారు. జీ స్టూడియోస్, ఉమేష్ కె.ఆర్.బన్సాల్, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, జాన్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రానికి మీనాక్షి దాస్ సహ నిర్మాతగా వ్యవహరించారు. జీ స్టూడియోస్, ఎమ్మాయ్ ఎంటర్టైన్మెంట్, జె.ఎ.ఎంటర్టైన్మెంట్ సమర్పణలో రూపొందిన ‘వేద’ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుంది.