ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు కన్నుమూత

ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు గారు నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. 1950 ఆగస్ట్ 21న కృష్ణాజిల్లా రిమ్మనపూడిలో జన్మించిన సూర్య నారాయణ బాబు గారు సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మీ తులసిని వివాహమాడారు. 1977లో ‘మనుషులు చేసిన దొంగలు’ చిత్రంతో నిర్మాతగా తొలి సినిమాను నిర్మించడం జరిగింది. ”దొంగల దోపిడి, నా ఇల్లు నా వాళ్ళు, రామ్ రాబర్డ్ రహీమ్, ఈ దేశంలో ఒక రోజు, మహా మనిషి, సంచలన, శంఖారావం, బజారురౌడీ, కలియుగ విశ్వామిత్ర, అల్లుడు దిద్దిన కాపురం తదితర సినిమాలను నిర్ణయించారు. కన్నడలోనూ రెండు, హిందీలో రెండు చిత్రాలు ఆయన నిర్మించడం జరిగింది. 1981లో ‘సంధ్య’ చిత్రంతో ఎ. కోదండ రామిరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేసారు. 1984లో ఎన్టీఆర్ బర్తరఫ్ ను ఆయన ఖండించారు. 1985లో అదే ఎన్టీఆర్ పై గుడివాడ నుండి పోటీ చేసారు.