సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ఈ సినిమాని డా. ఆరవేటి యశోవర్ధాన్ గారు ‘ఏ బి డి ప్రొడక్షన్స్’ బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 26 నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ :
నెల్లూరు నగరంలోని ఓ నలుగురు అనాధలు తమ చుట్టుపక్కల కనిపిస్తున్న పరిస్థితులలో ఎలా పెరిగారు? అపరిచితుల ప్రభావం వారిపై ఎంత మేరకు ఉంది? ఆ పరిస్థితుల వల్ల వాళ్ళు మంచివాడిగా మారార లేదా చెడ్డవారికి మారార అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా మొదల నుండి చివరి వరకు చూసుకుంటే వారి జీవితాలు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఎన్ని మలుపులు తిరిగాయి అనేది ఈ సినిమా.
నటినటుల పర్ఫార్మెన్స్ :
సినిమాలో అందరూ కొత్తవారు అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా తమకు వచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో నటించిన వారిలో కర్రోడు, క్వార్టర్ అలాగే చెత్తోడు అనే పాత్రలు నటించిన వారు వారి యొక్క కామెడీ టైమింగ్స్ తో నవ్వుకునేలా చేశారు.
సాంకేతిక విశ్లేషణ :
సినిమా ఒక యాక్షన్ డ్రామా అయినప్పటికీ ఒక మంచి సందేశంతో ఈ సినిమా తీయడం జరిగింది. అనాధలుగా ఉన్నవారు ఎటువంటి ఎక్కువగా ఇటువంటి ప్రలోభాలకి గురి అవుతారు, అలాగే ఆ ప్రభావం వల్ల వారికి ఇంకా సమాజానికి ఎటువంటి నష్టం వాటిల్లుతుంది అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు విజయం సాధించారు అని చెప్పుకోవాలి. తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలలో ఎటువంటి విధంగాను కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయడం జరిగింది. సినిమా ఎక్కువగా స్లమ్ ఏరియాలలో ఉండడంతో మనం చుట్టుపక్కల చూసి నిజ సంఘటనా విషయాలు ప్రతిబింబించినట్లు కనిపిస్తాయి.
పాజిటివ్ పాయింట్స్ :
నటీనటుల నటన, సందేహాత్మక కథ, నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
మైనస్ పాయింట్స్ :
నటీనటులు కొత్తవారు కావడం, స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉండటం, అన్ని సీన్లను ఇంచుమించుగా ఒకటే లొకేషన్ లో తీయడం.
సినిమా థియేటర్ కంటే ఎక్కువగా ఒటిటిలో ప్రేక్షకులు బాగా ఆదరించే అవకాశం ఉంది.